జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..
Send us your feedback to audioarticles@vaarta.com
జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపుతో 1122 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 18 ఏళ్ల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వినియోగించింది. మెజార్టీ డివిజన్ల రెండో రౌండ్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్ పూర్తయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటలకల్లా ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. 150 డివిజన్లకు 30 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతోంది. ప్రతి హాల్లో 14 టేబుల్స్‌ను కేటాయించారు.
ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బంది 8,152.. పరిశీలకులు 31 మందిని నియమించారు. కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్‌కు సీసీ టీవీల ఏర్పాటు చేశారు. మొదట మెహిదీపట్నం, చివరగా మైలార్దేవులపల్లి ఫలితం తేలనుంది. ఒక రౌండ్లో 14 వేల ఓట్లు లెక్కింపు జరగనుంది. బ్యాలెట్ కంటే ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లను నిషేధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదు అయింది. 74,67,256 ఓట్లకు... 34,50,331 ఓట్లు పోల్ అయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments