గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 49 మంది నేరచరితులు..
Send us your feedback to audioarticles@vaarta.com
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రకు సంబంధించిన జాబితా బయటకు వచ్చింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అభ్యర్థుల నేర చరితను బయటపెడుతుంది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేర చరితకు సంబంధించి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక నివేదికను బయటపెట్టింది. జాబితాను బట్టి చూస్తే జీహెచ్ఎంసీలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నేరచరితులు గణనీయంగానే ఉన్నారు.
మొత్తం 49 మంది అభ్యర్థులపై 96 క్రిమినల్ కేసులున్నాయి. అయితే కిందటిసారితో పోలిస్తే ఈ సంఖ్య కాస్త తగ్గింది. క్రితం సారి జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 72 మంది నేరచరితులు ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా.. ఈ సారి నేరచరితుల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులు కూడా ఉండటం గమనార్షం. నేరచరితుల్లో ఎక్కువ మంది బీజేపీ అభ్యర్థులే ఉన్నారు. బీజేపీ నుంచి 17 మంది, కాంగ్రెస్ నుంచి 12 మంది, టీఆర్ఎస్ నుంచి 13 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు ఈ జాబితాలో ఉన్నారు.
కాగా.. వీరిలో కేపీహెచ్బీ కాలనీకి చెందిన బీజేపీ అభ్యర్తి ప్రీతంరెడ్డిపై అత్యధికంగా 9 కేసులున్నాయి. ఇక టీఆర్ఎస్లో అత్యధికంగా మోండా మార్కెట్ డివిజన్, రాంగోపాల్ పేట అభ్యర్థినులు ఆకుల రూప, అరుణలపై నాలుగేసి చొప్పున కేసులున్నాయి. ఎంఐఎంలో అత్యధికంగా శాలిబండ అభ్యర్థి మహ్మద్ ముస్తఫా అలీ 7 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో అత్యధికంగా జహనుమా, శేరిలింగంపల్లి అభ్యర్థులు ఘయాసుద్దీన్, శివకుమార్లపై మూడేసి చొప్పున కేసులున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout