హీట్ పెంచుతున్న గ్రేటర్.. తొలిరోజు 20 నామినేషన్లు
Send us your feedback to audioarticles@vaarta.com
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే జీహెచ్ఎంసీలో పొలిటికల్ హీట్ దారుణంగా పెరిగిపోయింది. ఇప్పటికే సవాళ్లు - ప్రతి సవాళ్లు ప్రారంభమైపోయాయి. మాటల యుద్ధం ప్రారంభమై పోయింది. గ్రేటర్ సమరమంతా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగానే నడుస్తోంది. దుబ్బాక ఫలితాన్ని ఒక బీజేపీ స్ఫూర్తిగా తీసుకుంటే.. టీఆర్ఎస్ గుణపాఠంగా తీసుకుంది. దీంతో పార్టీలు జీహెచ్ఎంసీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఆది నుంచి ఆచితూచి అడుగులు..
గ్రేటర్లో తొలిరోజు 20 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. 105 మందితో అభ్యర్థుల తొలి జాబితాను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రకటించేసింది. 57 మంది కార్పొరేటర్లకు టీఆర్ఎస్ మరోసారి అవకాశం ఇచ్చింది. బీజేపీ 21 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. 45 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. 11 మందితో వామపక్షాలు తొలి జాబితాను విడుదల చేశాయి. ఇక టీటీడీపీ నేడు అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. నేడు 45 నుంచి 60 డివిజన్లకు జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది.
పొత్తుకు సాహసించని పార్టీలు..
ఈసారి పార్టీలన్నీ దాదాపుగా విడివిడిగానే బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. ఏ పార్టీకాపార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని భావించినప్పటికీ అభ్యర్థులను మాత్రం విడివిడిగానే ప్రకటించాయి. మరి ఇన్ని పార్టీలు బరిలోకి దిగుతుంటే ఓట్లు ఎంతో కొంత చీలే అవకాశమైతే తప్పక ఉంటుంది. ఈ ఓట్ల చీలిక ఏ పార్టీకి లాభిస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఏ పార్టీ కూడా అధికార టీఆర్ఎస్కు అనుకూలంగా అయితే లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడమే కాంగ్రెస్కు చేటు తీసుకురావడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా పొత్తుకు సాహించట్లేదని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments