గ్రేటర్ ఫలితం: తొలిరౌండ్‌లో ‘కారు’దే జోరు...
Send us your feedback to audioarticles@vaarta.com
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి తొలి రౌండ్ పూర్తైంది. ఈ ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రజా తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతోందన్న దానిపై ఆసక్తి నెలకొంది. దీంతో గ్రేటర్ ఎన్నికల ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా ఊహించినట్టుగానే తొలి రౌండ్ ఫలితం 11 గంటలకు వచ్చేసింది.
తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఆర్సీపురం, పటాన్‌చెరు డివిజన్లలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. మెహిదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు.
మెట్టుగూడలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రాసురి సునీత గెలుపొందారు. యూసుఫ్‌గూడలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ పటేల్ విజయం సాధించారు. ఏఎస్‌రావునగర్‌లో కాంగ్రెస్ శిరీషారెడ్డి, డబీర్‌పురాలో ఎంఐఎం అభ్యర్థి హుస్సేన్‌ఖాన్, కిషన్‌బాగ్‌లో ఎంఐఎం అభ్యర్థి మొబషీరుద్దీన్, అహ్మద్‌నగర్‌లో ఎంఐఎం అభ్యర్థి సర్ఫరాజ్ ఇప్పటి వరకూ విజయం సాధించారు.
అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో మాత్రం బీజేపీ మొదటి స్థానంలో ఉండగా టీఆర్ఎస్ మాత్రం రెండో స్థానానికి పడిపోయింది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1,926 కాగా.. ఇందులో దాదాపు 40 శాతం ఓట్లు చెల్లలేదు. ఇంకా 34 లక్షలకు పైగా ఓట్లు లెక్కించాల్సి ఉంది. కాగా.. బ్యాలెట: ఓట్ల లెక్కింపులో బీజేపీ అందుకోలేనంత స్పీడ్‌లో కారు దూసుకెళుతుండటం గమనార్హం. అయితే టీఆర్ఎస్ విజయం ముందుగా ఊహించిందే కానీ గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సాధించినన్ని స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంటుందో లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments