వారిని మెప్పించిన పార్టీకే జీహెచ్ఎంసీ పీఠం!
Send us your feedback to audioarticles@vaarta.com
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పార్టీలన్నీ వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. కానీ నిజానికి ఓటు బ్యాంకును కైవసం చేసుకోవడంతో కీలక శక్తులు కొన్ని ఉంటాయి. వాటిని పట్టుకోగల శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది. మరి అలా ఏ పార్టీ పట్టుకుంటుందో ఆ పార్టీదే జీహెచ్ఎంసీ పీఠం. నిజానికి జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉండగా దాదాపు సగం డివిజన్లలో నిర్ణయాత్మక శక్తికి బీసీలున్నారు. వారి ఓట్లను రాబట్టుకుంటే చాలు.. సులభంగా జీహెచ్ఎంసీ పీఠం దక్కించుకోవచ్చు. ప్రస్తుతం రాజకీయ పార్టీలన్నీ ఈ విషయాన్ని తెలుసుకునే ఉండొచ్చు. అందుకే కొన్ని రాజకీయ పార్టీలు 50 శాతానికి మించి బీసీలకు స్థానాలను కల్పించాయి.
నిజానికి 33 శాతం రిజర్వేషనే బీసీలకు వర్తిస్తుంది. కానీ జనరల్ స్థానాల్లో ఎవరికైనా బీఫారం ఇవ్వొచ్చు దీంతో కొన్ని పార్టీలు బీసీ ఓటు బ్యాంకును క్యాష్ చేసుకునేందుకు ఈ స్థానాలను కూడా బీసీలకే కేటాయించాయి. దీంతో 50 శాతానికి మించి బీసీలకు స్థానాలను కల్పించినట్టైంది. బీసీ కులాల్లో కూడా కొన్నింటికే అగ్రతాంబూలం దక్కింది. ఎక్కువగా ఓటు బ్యాంకు ఉన్న యాదవ, గౌడ, మున్నూరు కాపు కులాలకే పలు పార్టీలు బీఫారంలు అందించాయి. పలు డివిజన్లలో బీసీ రిజర్వేషన్ల ప్రకారం యాదవ సామాజిక వర్గానికి టీఆర్ఎస్ 14, బీజేపీ-15, కాంగ్రెస్-10, టీడీపీ-8 టికెట్లు ఇచ్చాయి. గౌడ సామాజిక వర్గానికి టీఆర్ఎస్-15, బీజేపీ-10, కాంగ్రెస్-11, టీడీపీ-12 టికెట్లు కేటాయించాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి టీఆర్ఎస్-12, బీజేపీ-8, కాంగ్రెస్-4 ఇచ్చాయి. కాపు (ఓసీ)లకు టీఆర్ఎస్-1, బీజేపీ-4, కాంగ్రె స్-4, టీడీపీ-3; కమ్మ (ఓసీ)లకు టీఆర్ఎస్-4, బీజేపీ-4, కాంగ్రెస్-2, టీడీపీ-6 కేటాయించాయి.
గ్రేటర్ హైదరాబాద్లో ప్రస్తుతం 74.04 లక్షల మంది ఓటర్లు ఉండగా, వారిలో 18 లక్షలకుపైగా బీసీలే ఉన్నారు. సుమారు పది నుంచి 12 సర్కిళ్ల పరిధిలో బీసీ సామాజిక వర్గం 30 శాతానికిపైగా ఉంది. గోషామహల్, ఖైరతాబాద్, కార్వాన్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, పటాన్చెరు తదితర ప్రాంతాల్లో బీసీల ప్రాబల్యం అధికంగా ఉంది. అయితే వారికి పార్టీలన్నీ సముచిత స్థానాన్నే కల్పించాయి. కానీ ఈ ప్రాంత వాసులు ఏ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారో వారినే జీహెచ్ఎంసీ పీఠం వరించే అవకాశం ఉంది. కానీ మరి బీసీలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో.. ఏ పార్టీ బీసీ ఓటు బ్యాంకును సద్వినియోగం చేసుకోగలుగుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com