జిబ్రాన్..రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు
Send us your feedback to audioarticles@vaarta.com
రన్ రాజా రన్ చిత్రం పాటలు వినగానే.. శ్రోతలకు ఓ ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. కొత్త సౌండింగ్‌తో సంగీత దర్శకుడు జిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ ఇన్‌స్టంట్‌గా హిట్ అయ్యింది. ఆ తరువాత జిల్, బాబు బంగారం, హైపర్ తదితర తెలుగు చిత్రాలకు పనిచేసిన జిబ్రాన్.. తెలుగులో కంటే తమిళంలోనే మంచి ఆఫర్లను పొందుతున్నాడు. కమల్ హాసన్‌తో మూడు సినిమాలకు పనిచేసిన జిబ్రాన్‌కి ఈ నెల ప్రత్యేకం.
ఎందుకంటే.. ఇద్దరు స్టార్ హీరోయిన్‌లు నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు రెండు వారాల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ రెండు కూడా తమిళ చిత్రాలే కావడం విశేషం. అందులో ఒకటి జ్యోతిక నటించిన మగళిర్ మట్టుమ్ ఈ నెల 15న విడుదల కానుండగా.. లేడీ సూపర్‌స్టార్ నయనతార నటించిన అరమ్ ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ రెండు చిత్రాలలో ఏ సినిమా జిబ్రాన్‌కి మంచి పేరు తీసుకువస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments