ఘాజీ రానా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Tuesday,December 13 2016]

ద‌గ్గుబాటి రానా న‌టిస్తున్న భారీ చిత్రం ఘాజీ. ఈ చిత్రంలో రానా, తాప్సీ, క‌య్ క‌య్ మీన‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్, పి.వి.పి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంక‌ల్ప్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రం ఘాజీ ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల రిలీజ్ చేసారు.ఈ ఫ‌స్ట్ లుక్ కి విశేష స్పంద‌న ల‌భించింది. ఇక రానా పుట్టిన‌రోజు (ఈనెల 14) సంద‌ర్భంగా ఈ మూవీలో రానా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు. నావేల్ ఆఫీస‌ర్ గా న్యూలుక్ లోఉన్న రానా స్టిల్ ఫ్యాన్స్ కు ఓ స‌ర్ ఫ్రైజే అని చెప్ప‌చ్చు. బాహుబ‌లి త‌ర్వాత రానా న‌టించిన చిత్ర‌మిది. బాహుబ‌లి 2 కంటే ముందే ఈ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. స‌బ్ మేరిన్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న తొలి ఇండియాన్ మూవీ ఘాజీ కావ‌డం విశేషం. ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ లో రూపొందిస్తున్నారు. వైవిధ్యమైన క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 17న రిలీజ్ చేయ‌నున్నారు.

రానా, తాప్సీ, క‌య్ క‌య్ మీన‌న్, అతుల్ కుల‌క‌ర్ణి, ఓమ్ పురి, నాజ‌ర్, రాహుల్ సింగ్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి వి.ఎఫ్‌.ఎక్స్ - ఈవిఎ మోష‌న్ స్టూడియోస్, కాస్టూమ్స్ డిజైన‌ర్ అశ్వ‌నాత్ బైరి, స్టంట్స్ - జాషువ‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ - శివ‌మ్ రావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - కె, ఎడిట‌ర్ - ఎ శ్రీక‌ర్ ప్ర‌సాద్, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్ర‌ఫి - మ‌ది, అడిషిన‌ల్ స్టోరీ & స్ర్కీన్ ప్లే - నిరంజ‌న్ రెడ్డి, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ & పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ - ఎన్.ఎం. పాషా, ప్రొడ్యూస‌ర్స్ ఆఫ్ మ్యాట్నీ - అన్వేష్ రెడ్డి, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, ప్రొడ్యూస‌ర్స ఫ‌ర్ పి.వి.పి సినిమా - పేర‌ల్ వి పొట్లూరి, ప‌ర‌మ్ వి పొట్లూరి, క‌విన్ అన్నే, స్టోరీ, స్ర్కీన్ ప్లే & డైరెక్ష‌న్ - సంక‌ల్ప్.

More News

యునిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రియాంక....

ఐక్యరాజ్యసమితిలో ముఖ్య విభాగమైన యునిసెఫ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది.

చైత‌న్య - రానా క‌లిసి సినిమా చేస్తున్నారా..?

అక్కినేని నాగ‌చైత‌న్య‌, ద‌గ్గుబాటి రానా వీరిద్ద‌రూ క‌లిసి ఏక్టింగ్ ట్రైనింగ్ తీసుకోవ‌డం...ఆత‌ర్వాత హీరోలు అవ్వ‌డం...అలాగే వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న‌ రిలేష‌న్ గురించి తెలిసిందే.

కింగ్ మూవీలో కింగ్ రోల్ చేస్తున్న విలన్..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్లో రూపొందుతున్నభక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.

మ‌హేష్ - విజ‌య్ మూవీకి ఉన్న లింకేంటి..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ లో రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది.

రవితేజ కథ అది కాదా..?

మాస్ మహారాజా ఏడాది పాటు హాలీడేస్ను ఎంజాయ్ చేశాడు. వచ్చే ఏడాది కొత్త సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. అనిల్ రావిపూడి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు రవితేజ.