మొన్న ఘట్కేసర్.. నిన్న విజయనగరం.. ఎందుకిలా?
Send us your feedback to audioarticles@vaarta.com
మొన్న ఘట్కేసర్.. నిన్న విజయనగరం జిల్లా గుర్ల.. ప్రాంతం ఏదైతేనేమి తెలుగు రాష్ట్రాల్లో వరుస ఘటనలు తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. చివరకు ఇలాంటి ఘటనలు ఆపదలో నిజంగా ఎవరైనా యువతులు ఉంటే అనుమానించాల్సిన పరిస్థితులను కల్పిస్తున్నాయి. ఈ ఘటనల కారణంగా నిజంగా ఇబ్బందుల్లో అమ్మాయిలకు న్యాయం జరగక పోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు తల్లిదండ్రులకు సైతం ఇదొక సంకట స్థితిగా మారుతోంది. ఇలా అమ్మాయిలు చేయడం వలన ఎవరికి నష్టమనేది ఆలోచించట్లేదు. టెక్నికల్‌గా ఇంతటి అభివృద్ధిని సాధించిన సమయంలో ఇలాంటి అబద్ధాలతో ఎవరిని మోసం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.
విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ముళ్ల పొదల్లో ఓ యువతి నిస్సహాయ స్థితిలో పడి ఉండటం సోమవారం కలకలం రేపింది. విజయనగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సదరు యువతి హాస్టల్ నుంచి తెర్లాం మండలంలోని స్వగ్రామానికి ఆదివారం మధ్యాహ్నం ప్రయాణమైంది. అయితే ఆమె ఇంటికి చేరలేదు. సోమవారం ఉదయం గుర్ల పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని పొదల్లో యువతి కనిపించింది. కాళ్లు, చేతులు కట్టేసి.. నోటిలో గుడ్డతో విలవిల్లాడుతూ స్థానికుల కంట పడింది. వెంటనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హుటాహుటిన ఆమె కాళ్లు, చేతులకున్న కట్లు విప్పేసి పోలీసులు పీహెచ్‌సీకి తరలించారు. కట్ చేస్తే.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. యువతి కాళ్లు చేతులు కట్టి పడేసిన కేసు మిస్టరీ కేవలం మూడు రోజల్లో వీడింది. దీనికి సంబంధించిన విశేషాలను ఎస్పీ రాజకుమారి మీడియాకు వెల్లడించారు. స్నేహితులతో బయటకు వెళ్లిన విషయం ఇంట్లో తెలుస్తుందని యువతి కట్టు కథ అల్లినట్లు ఎస్పీ తెలిపారు. కుటుంబ సభ్యులను నమ్మించేందుకు తానే కాళ్లు, చేతులు కట్టుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. యువతి అపస్మారకస్థితిలో పడి ఉన్నట్లుగా నటించిందని రాజకుమారి చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout