కిడ్నాప్ డ్రామా ఆడిన ఘట్కేసర్ విద్యార్థిని ఆత్మహత్య
Send us your feedback to audioarticles@vaarta.com
కిడ్నాప్ డ్రామా ఆడి కన్నతల్లిదండ్రులతో పాటు పోలీసులను సైతం మోసగించిన ఘట్కేసర్కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. షుగర్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లి పదే పదే ఫోన్ చేస్తుండటంతో కిడ్నాప్ డ్రామా ఆడింది. తొలుత తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశాడని తల్లికి వెల్లడించింది. దీంతో హడలిపోయిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఫోన్ నంబర్ ఆధారంగా చివరకు యువతిని పట్టుకుని వెంటనే తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత విచారణ చేపట్టిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి.
ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి ఆమె నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లిన విద్యార్థిని... తల్లి పదే పదే ఫోన్ చేస్తుండటంతో.. ఏం చేయాలో తెలియక తనను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేశారంటూ ఆ యువతి డ్రామాకు తెర తీసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు ఆమెకు ఫోన్ చేసిన సమయంలో కూడా హైడ్రామా క్రియేట్ చేసింది. తనను ఏం చేయొద్దంటూ సరికొత్త నాటకానికి తెరదీసింది. ఈ ఫోన్ కాల్‌ను సైతం పోలీసులు విడుదల చేశారు. అలాగే పోలీసులు తన దగ్గరకు వచ్చిన సమయంలోనూ ఆమె అదే నాటకాన్ని కొనసాగించింది. ఆ తరువాత పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు విషయం వెలుగు చూసింది.
యువతి ఫిర్యాదు మేరకు నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు. అయితే విచారణలో ఆటో డ్రైవర్లకు సంబంధం లేదని తేలడంతో సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్నంగా పరిశీలించారు. ఆ యువతి రాంపల్లి సమీపంలో ఆటో దిగి బైక్ ఎక్కి వెళ్లినట్లు గుర్తించారు. వాళ్లు వెళ్లిన బైక్ నంబర్‌ను సైతం గుర్తించారు. యువతి ఏ సమయంలో ఎక్కడుంది సహా మొత్తం వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఆటోడ్రైవర్లకు సాక్షాత్తు ఎస్పీ క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది. సదరు విద్యార్థిని ప్రవర్తనపై అటు సమాజం నుంచి.. ఇటు కుటుంబంలోనూ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితాన్ని ఊహించకుండా చేసిన పని చివరికి ఆమె బలవన్మరణానికి దారితీసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout