ఇండస్ట్రీకి షాక్: ఘంటసాల కుమారుడు మృతి.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలుసా!
- IndiaGlitz, [Thursday,June 10 2021]
కరోనా విలయతాండవానికి సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా బలవుతున్నారు. తాజాగా ఇండస్ట్రీ మరో కీలక వ్యక్తిని కోల్పోయింది. లెజెండ్రీ మ్యుజీషియన్ ఘంటసాల రెండవ కుమారుడు ఘంటసాల రత్నకుమార్ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఇదీ చదవండి: ప్రభాస్, ప్రశాంత్ నీల్, దిల్ రాజు కాంబో.. మైండ్ బ్లోయింగ్ ప్లానింగ్!
కరోనాతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలతో రత్నకుమార్ చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితమే కరోనా నెగటివ్ గా తేలింది. అయితే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో రత్నకుమార్ ఆకస్మిక మృతి చెందారు.
గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రత్నకుమార్ సుప్రసిద్ధి పొందారు. ముఖ్యంగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఐతే 1000 పైగా చిత్రాలకు పనిచేశారు. 10 వేల టీవీ ఎపిసోడ్స్ కు డబ్బింగ్ అందించారు. రోజా, బాంబే లాంటి చిత్రాల్లో అరవింద్ స్వామికి డబ్బింగ్ చెప్పింది ఈయనే. షారుఖ్,సల్మాన్ లాంటి హీరోలకు కూడా రత్నకుమార్ తన వాయిస్ అందించారు.
ఏకధాటిగా 8 గంటలపాటు డబ్బింగ్ చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. రత్నకుమార్ మృతితో కుటుంబ సభ్యులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు.