ఓడితే రికార్డ్స్‌లో .. గెలిస్తే చరిత్రలో : చరణ్ వాయిస్‌తో ఆకట్టుకుంటున్న 'గని' టీజర్
Send us your feedback to audioarticles@vaarta.com
కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అన్ని లవ్ స్టోరీలే చేశాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. యాక్షన్ సినిమాకు సరిపోయే కట్‌అవుట్ ఉన్నా కూడా వరుణ్ ఎందుకో ఆ జోనర్ వైపు ఎక్కువగా వెళ్లలేదు. అయితే అన్నయ్య రామ్‌చరణ్, బావ అల్లు అర్జున్‌లాగా తాను కూడా మాస్ యాక్షన్ మూవీస్ చేయాలనే ఉద్దేశ్యంతో జోనర్ మార్చాడు. దీనిలో భాగంగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం 'గని'. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, వరుణ్ తేజ్ వర్కవుట్ వీడియోలు అంచనాలు పెంచాయి. గని సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్గా కనిపించనున్నాడు. అందులో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ జంటగా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్రలు కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా సోమవారం రామ్ చరణ్ వాయిస్ ఓవర్‌తో టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ మొత్తంలో రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో చెప్పిన ఆ భారీ డైలాగులు హైలైట్‌గా నిలుస్తున్నాయి. "ప్రతి ఒక్కరి కథలో కష్టాలు .. కన్నీళ్లు ఉంటాయి. కోరికలుంటాయి .. కోపాలుంటాయి. కలబడితే గొడవలుంటాయి. "అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ ఛాంపియన్ అయిపోవాలనే ఆశ ఉంటుంది. కానీ విజేతగా నిలిచేది ఒక్కడే. ఆ ఒక్కడివి నువ్వే ఎందుకవ్వాలి? ఆట ఆడినా .. ఓడినా కూడా రికార్డ్స్‌లో ఉంటావు .. కానీ గెలిస్తే మాత్రం చరిత్రలో ఉంటావు" అంటూ చరణ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న గని ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇక వరుణ్ తేజ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం 'ఎఫ్ 3' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. 'ఎఫ్ 2' సినిమాకు సీక్వెల్‌గా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ పిర్జాదా, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com