'స‌రిగ‌మగ‌మ' లిరిక‌ల్ సాంగ్‌తో ఆకట్టుకుంటోన్నరాజ్‌ తరుణ్ ‘ఒరేయ్‌ బుజ్జిగా'

  • IndiaGlitz, [Sunday,June 28 2020]

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా...'. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా ఈ చిత్రం నుండి 'స‌రిగ‌మ‌ప' లిరికిల్ సాంగ్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

'స‌రిగ‌మ‌గ‌మ‌ గామ హంగామ చేద్దామా,,ప‌ద‌నిస‌నిస నీస్సా నీ నీషా..నీద‌మ్మా' అంటూ హుశారుగా సాగే ఈ పాట‌లో రాజ్‌తరుణ్ ఎన‌ర్జిటిక్ స్టెప్పులు, హెబా ప‌టేల్ అందాలు యూత్‌ని ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట‌కు వ‌న‌మాలి సాహిత్యం అందించ‌గా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్‌ రూబెన్స్ గానం చేశారు. కుమారి 21ఎఫ్, అంధగాడు, ఈడోరకం ఆడోరకం లాంటి చిత్రాల్లో నటించి ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నరాజ్‌తరుణ్, హెబా ప‌టేల్ క‌లిసి న‌టిస్తోన్న మ‌రో చిత్రం కావ‌డంలో సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. మ్యాంగో మ్యూజిక్‌ ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడులదవుతున్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల తేదిని ప్ర‌క‌టించ‌నున్నారు.

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.

More News

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్‌ను కెలుకుతున్న వ‌ర్మ‌!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను, అత‌ని అభిమానుల‌ను వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌కు ప‌బ్లిసిటీ కావాల్సిన‌ప్పుడల్లా కెలుకుతుంటాడు.

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలకు బ్రేకేసిన కరోనా

ఏపీ, తెలంగాణ మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడిపే విషయమై గతంలో చర్చలు నడిచాయి.

ప్రమాదం అంచున డయాబెటిస్ రోగులు..

ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే కరోనా నుంచి బయటపడటం చాలా కష్టమని వైద్యులు వెల్లడిస్తూనే ఉన్నారు.

కరోనా లిస్టులో కొత్తగా మరో మూడు లక్షణాలు

కరోనా కేసులతో పాటు లక్షణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కరోనా లక్షణాల లిస్టులో అమెరికా హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ మరో మూడు లక్షణాలను చేర్చింది.

వసుధ ఫౌండేషన్ సౌజన్యంతో 'మనం సైతం' భారీ వితరణ!!

'ఆపన్నుల పాలిట అభయ హస్తం'గా మారిన కాదంబరి సారధ్యంలోని 'మనం సైతం'