ఆగస్టు 4న దర్శకుడు వచ్చేస్తున్నాడు!

  • IndiaGlitz, [Saturday,July 22 2017]

ఓ సినీ దర్శకుడు అందమైన అమ్మాయి ప్రేమలో పడతాడు. తన వృత్తిలో రాణిస్తూనే ప్రేమను గెలిపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సంఘర్షణ ఏమిటన్నదే దర్శకుడు చిత్ర ఇతివృత్తం అన్నారు చిత్ర దర్శకుడు హరిప్రసాద్ జక్కా. స్వీయ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 4న ప్రేక్షకులముందుకు రానుంది.
ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో సుకుమార్ మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఆడియోకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఈ నెల 29న అల్లు అర్జున్ అతిథిగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నాం అని చెప్పారు. సుకుమార్ శైలిలో సాగే వినూత్న కథా చిత్రమిదని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు. కథానుగుణంగా శ్రావ్యమైన బాణీలను అందించే అవకాశం లభించిందని, ఆడియో శ్రోతల ఆదరణ పొందటం ఆనందంగా వుందని సంగీత దర్శకుడు సాయికార్తీక్ తెలిపారు.
ఈ తరహా కథతో ఇప్పటి వరకు సినిమా రాలేదని సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోల్ పేర్కొన్నారు. పాటలన్నీ నవ్యమైన బాణీలతో ఆకట్టుకుంటున్నాయని హీరో అశోక్ చెప్పారు. అశోక్, ఈషా, పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎడిటింగ్: నవీన్‌నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా.

More News

డ్రగ్స్ వ్యవహారంపై వర్మ రియాక్షన్...

వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రామ్గోపాల్ వర్మ, మరోసారి వార్తలకు కేంద్ర బిందువయ్యాడు. ప్రస్తుతం టాలీవుడ్ను ఊపేస్తున్న సమస్య డ్రగ్స్. ఈ డ్రగ్స్ కేసులో వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ ప్రథమంగా సిట్ విచారణను ఫేస్ చేశాడు.

ఆగస్ట్ 3 నుంచి బాలకృష్ణ-కె.ఎస్.రవికుమార్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించనున్న 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున విషయం తెలిసిందే.

'వైశాఖం' చిత్రాన్ని పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు - డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ.బి

'చంటిగాడు', 'గుండమ్మగారి మనవడు', 'లవ్లీ' వంటి సూపర్హిట్స్ తర్వాత డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ క్రేజీ చిత్రం 'వైశాఖం'.

క్రేజీ హీరోలు, దర్శకులతో భారీ చిత్రాల నిర్మాణం దిశగా 'లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్'

వీడుతేడా చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది "లక్ష్మీ నరసింహా ఎంటర్ టైన్మెంట్స్". నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాతో నటుడు చిన్ని కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత సుధీర్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిఖిల్ హీరోగా నిర్మించిన స్వామి రారా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

'నక్షత్రం' సెన్సార్ పూర్తి, ఆగస్టు 4 న విడుదల

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో “బుట్ట బొమ్మ క్రియేషన్స్” పతాకంపై ప్రొడ్యూసర్ కె.శ్రీనివాసులు “విన్ విన్ విన్ క్రియేషన్స్”పతాకంపై నిర్మాతలు వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “నక్షత్రం”