'జార్జిరెడ్డి' మూవీకి ఊహించని షాక్.. రిలీజ్ కష్టమేనా!?
Send us your feedback to audioarticles@vaarta.com
సందీప్ మాధవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘జార్జ్‌రెడ్డి’. జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నవంబర్ 22న విడుదల కానుంది. 1965 కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ విద్యార్థి నాయకుడైన జార్జ్ రెడ్డిని అప్పటి కాలేజ్ గొడవల్లో కొంత మంది దుండగులు హత్య చేశారు. ఆయన జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ‘దళం’ దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. అప్పట్లో ఉస్మానియా కాలేజ్‌లో జరిగే అన్యాయాలను ఎదిరించి ఎందరో విద్యార్థులకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన జార్జ్‌రెడ్డి చదువులోనూ టాపరే. అయితే సినిమా ఎలా ఉండబోతోంది..? ఏమేం చూపించబోతున్నారు..? ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఉస్మానియా పూర్వ.. ప్రస్తుత విద్యార్థులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే ఈ చిత్రం చుట్టూ వివాదాలే నడుస్తున్నాయ్.
మొన్నటికి మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అనుమతిని తెలంగాణ పోలీసులు నిరాకరించారు. ఎందుకనే దానిపై కూడా నిశితంగా పూసగుచ్చినట్లుగా పోలీసులు వివరణ కూడా ఇచ్చారు. అయితే ఈ వివాదం సద్దుమణుగకే ముందే.. ఈసారి ఏబీవీపీ తెరపైకి వచ్చింది. ఈ సినిమాను రిలీజ్ చేయనివ్వమని గట్టిగా హెచ్చిరిస్తోంది. తాము ఈ చిత్రాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ఏబీవీపీ సెక్రటరీ శ్రీశైలం మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ‘ఈ చిత్రాన్ని నిషేధించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి జార్జిరెడ్డి. సినిమాలో ఏబీవీపీని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయి. అందుకే ఈ చిత్రాన్ని రిలీజ్ కాకుండా అడ్డుకుంటాం. నిజానిజాలను సెన్సార్ బోర్డు పరిశీలించాలి’ అని శ్రీశైలం చెప్పుకొచ్చారు. అయితే సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేదానిపై మరోసారి అనుమానాలు మొదలయ్యాయ్.. మరి ఈ వ్యవహారం సెన్సార్ బోర్డు దాకా వెళితే సభ్యులు ఏం చెబుతారు..? సినిమా రిలీజ్ అవుతుందా..? మొదటికే మోసం వస్తుందో..? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout