నిజానికి అది పవన్ కళ్యాణ్ చేయాలనుకున్నారు: సందీప్ మాధవ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ నెల 22 న రిలీజవుతుంది ‘జార్జిరెడ్డి’ సినిమా. సందీప్ మాధవ్ ఈ సినిమాలో ‘జార్జిరెడ్డి’ గా నటించాడు. 1968 – 70 లో బాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ బయోపిక్ లో జార్జిరెడ్డి లైఫ్ లోని కొన్ని కీలక అంశాలను తెరకెక్కించారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సందీప్ మాధవ్ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు.
వంగవీటి తరవాత…
‘వంగవీటి…’ సినిమా తరవాత అవకాశాలు వచ్చాయి కానీ ఆ సినిమా తరవాత చేయదగ్గ సినిమా అనిపించే స్థాయిలో ఏదీ కనెక్ట్ అవ్వలేదు. అప్పుడు జీవన్ గారు ఈ కథ చెప్పారు… చాలా ఎగ్జైటెడ్ అయ్యాను…
కొన్ని ప్రిపరేషన్స్…
జార్జిరెడ్డి క్యారెక్టర్ కోసం కొన్ని ప్రిపరేషన్స్ చేశాను. ఈ సినిమా చేస్తున్నాం అని ఫిక్సయ్యాక ఆయనకి సంబంధించిన ఆర్టికల్స్, బుక్స్… కొన్ని వీడియోస్ చూశాను. జార్జిరెడ్డి గారితో కలిసి చదువుకున్న వాళ్ళను, ఆయన ఫ్రెండ్స్ ని కొందరిని కలిసి ఆయన గురించి తెలుసుకున్నాను. ఇకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్ గురించి కంప్లీట్ గా తెలుసుకునేంత ఫూటేజ్ ఏమీ దొరకలేదు. మహా అయితే కొన్ని ఫోటోస్.. ఒక చోట ఆయన స్పీచ్.. దాన్ని బేస్ చేసుకునే ప్రిపేర్ అయ్యాను…
అలా జరిగింది…
‘జ్యోతిలక్ష్మి’ సినిమా తరవాత కమెడియన్ గా అవకాశాలు వస్తాయనుకున్నా.. కానీ అనుకోకుండా వర్మ గారు… ‘నిన్ను చూస్తుంటే వంగవీటి రాధ’ లా ఉన్నావ్… ఓసారి ఈ లుక్స్ కోసం ట్రై చెయి అన్నారు… అలా ప్రిపేర్ అవ్వడం జరిగింది..
ఆయన క్యారెక్టర్ అలాంటిది…
‘జార్జిరెడ్డి’ కంప్లీట్ గా బయోపిక్ అని చెప్పను కానీ, కొన్ని చోట్ల కమర్షియల్ ఎలిమెంట్స్ ఆడ్ చేయడం జరిగింది. అవి కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. బేసిగ్గా ఆయన బాక్సర్, స్టూడెంట్ లీడర్ కాబట్టి.. విజువలైజేషన్ లో హీరోయిజం న్యాచురల్ గానే ఉంటుంది.
అప్పటికీ ఇప్పటికీ అదే డిఫెరెన్స్…
1968 – 70 లో స్టూడెంట్స్ కి… ఇప్పటి స్టూడెంట్స్ కి చాలా డిఫెరెన్స్ ఉంటుంది. అప్పట్లో వాళ్ళు చాలా మెచ్యూర్డ్ గా ఉండేవాళ్ళు. ఏం చేసినా వాళ్ళలో సీరియస్ నెస్ ఉండేది. జార్జిరెడ్డి తో పాటు ఆయనతో పాటు ఉండే క్యారెక్టర్స్ లో కూడా ఆ సీరియస్ నెస్ ఉంటుంది.
ప్రయత్నం చేశాం…
1960 – 70 బ్యాక్ డ్రాప్ కాబట్టి ఆల్మోస్ట్ అప్పటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాం. మీరు రేపు సినిమాలో చూడబోయే బైక్స్.. సైకిల్స్ ఆల్మోస్ట్ అన్నీ కొనేశాం… అవన్నీ అప్పట్లో వాడేవే…
నమ్మకం ఉంది కాబట్టే…
ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అదే స్థాయిలో రీచ్ అవుతుందనే నమ్మకంతో చాలా కష్టపడ్డాం… ట్రైలర్ లో చూసి అది అందరూ ఉస్మానియా యూనివర్సిటీలో షూట్ చేశాం అనుకుంటున్నారు. నిజానికి అది సెట్ వేశాం. 1960 లో యూనివర్సిటీ ఎలా ఉండేదో దాన్ని బట్టి సెట్ వేశారు…
నాకా ఫీలింగ్ కలగలేదు…
ఈ సినిమా వల్ల రెండేళ్ళ గ్యాప్ వచ్చింది. చాలా సినిమాలు వదులుకున్నాను ఈ సినిమా చేసే ప్రాసెస్ లో… ఈ సినిమా ఉండి ఉండకపోతే వాటిలో ఏవో కొన్ని చేసేసేవాడిని.. కానీ ఈ కథ ముందు ఏదీ గొప్పగా అనిపించలేదు.
పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకున్నారు…
నిజానికి జార్జిరెడ్డి అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. ఈ సినిమా ఆయన చేయాలనుకున్నారట.. అందుకే ఓ సాంగ్ ఆయనికి డెడికేట్ చేశాం…
బుల్లెట్ బైక్ సాంగ్…
బుల్లెట్ బైక్ సాంగ్ కి… ట్రైలర్ కి వచ్చిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దానికి రీజన్.. ఈ సినిమాలో ఇలాంటి సాంగ్ ఏంటి..? అనుకోవడమే… ఈ సాంగ్ ని సెపరేట్ గా చూస్తే అలా అనిపిస్తుంది కానీ. సినిమా చూస్తే ఖచ్చితంగా కనెక్టివిటీ ఉందనిపిస్తుంది.
కన్నీరు తెప్పించే ఎలిమెంట్స్…
సినిమా చూశాక ‘ఇంత గొప్ప మనిషిని మనం పోగొట్టుకున్నామా…?’ అనే ఫీలింగ్ అయితే డెఫ్ఫినెట్ గా వస్తుంది. ‘ఇస్రో..’ లాంటి సంస్థలో అవకాశం వచ్చినా వదులుకున్నారాయన… ఇలాంటి హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ సినిమాలో చాలా ఉంటాయి
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments