ఉంటే చాలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ అవ‌స‌రం లేదు - హీరో నాని

  • IndiaGlitz, [Thursday,June 23 2016]

నేచుర‌ల్ స్టార్ నాని, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం జెంటిల్ మ‌న్. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న నివేధ థామ‌స్, సుర‌భి న‌టించారు. శ్రీదేవి మూవీస్ పై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవ‌ల రిలీజైన జెంటిల్ మ‌న్ చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ సంద‌ర్భంగా జెంటిల్ మ‌న్ స‌క్సెస్ మీట్ ను హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్లో నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా హీరో నాని మాట్లాడుతూ...కెరీర్ లో జ‌యాప‌జ‌యాలు వ‌స్తాయి. కానీ..కొన్ని చిత్రాల‌తో మాత్ర‌మే గౌర‌వం వ‌స్తుంది. జెంటిల్ మ‌న్ చిత్రంతో నాకు అదే ల‌భించింది. జెండా పై క‌పిరాజు చిత్రంలో డ్యూయ‌ల్ రోల్ చేసాను... చాలా క‌ష్ట‌ప‌డ్డాను. కానీ...ఆశించిన ఫ‌లితం రాలేదు. అయితే ఈ సినిమాలో డ్యూయ‌ల్ రోల్ చేసాను. ఈ మూవీతో నాకు డ‌బుల్ స‌క్సెస్ వ‌చ్చింద‌నే చెప్పాలి. మోహ‌న్ గారు క‌థ చెప్పిన‌ప్పుడు ఎగ్జైట్ అయ్యాను. ఇందులో అవ‌స‌రాల శ్రీనివాస్ న‌టిస్తున్నాడు అని చెప్పిన‌ప్పుడు మ‌రింత ఎగ్జైట్ అయ్యాను. థ్రిల్ల‌ర్ సినిమాల‌కు ఎడిటింగ్ కీల‌కం. అలాగే సినిమాలో బిగ్గెస్ట్ టాస్క్ అంటే క్లైమాక్స్. ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి క‌న్ ఫ్యూజ‌న్ లేకుండా అర్ధ‌మ‌య్యేలా ఎడిట‌ర్ మార్తాండ్ కె వెంక‌టేష్ గారు చ‌క్క‌గా ఎడిటింగ్ చేసారు. మ‌ణిశ‌ర్మ గారి మ్యూజిక్ కి థియేట‌ర్స్ లో క్లాప్స్ ప‌డుతున్నాయి. మ‌ణిశ‌ర్మ గారు మ్యూజిక్ అందించిన చిత్రంలో నేను న‌టించ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. సుర‌భి, నివేధ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు బాగా న‌టించారు. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు ఎలా అనుకున్నాను. కానీ ప్రేక్ష‌కుల స‌పోర్ట్ తో ఉంటే చాలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ అవ‌స‌రం లేదు. ఈ విష‌యంలో నాకంటే గొప్ప బ్యాక్ గ్రౌండ్ ఎవ‌రికీ లేదు అన్నారు.

డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ మాట్లాడుతూ...నా సినిమాలు సంసార‌ప‌క్షంగా - సెన్సార్ ప‌క్షంగా ఉంటాయి అని అంటారు. అందుకే ఈ సినిమాకి యు స‌ర్టిఫికెట్ వ‌చ్చింది. ప్రేక్ష‌కుల విలువైన స‌మ‌యం, డ‌బ్బు వృధా కాని సినిమాలు రావాలి. ఫెయిల్యూర్స్ స‌క్సెస్ కు అతీతంగా ఈ చిత్రం చేసే అవ‌కాశాన్ని కృష్ణ‌ప్ర‌సాద్ గారు ఇచ్చారు. ఈ సినిమాకి ఫ‌స్ట్ హీరో ర‌చ‌యితే. అద్భుత‌మైన క‌థ అందించారు. 2008లో నానితో అష్టా చ‌మ్మా సినిమా చేసాను. ఫస్ట్ మూవీలోనే నాని వైవిధ్య‌మైన న‌ట‌న ప్ర‌ద‌ర్శించాడు. నాకు బాగా ఇష్ట‌మైన వ్య‌క్తుల్లో నాని ఒక‌రు. నివేధ‌, సుర‌భి పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేసారు. ఇక మ‌ణిశ‌ర్మ గారు ఈ చిత్రం కోసం వ‌ర్క్ చేసిన విధానాన్ని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను అన్నారు.

నిర్మాత కృష్ణ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ...తెలుగు ప్రేక్ష‌కుల‌కు మంచి చిత్రాల‌ను అందించాల‌ని ప్ర‌య‌త్నించాను. ఈ క‌థ‌ను మోహ‌న్ గార్కి వినిపించిన వెంట‌నే చాలా బాగుంది అని చెప్పారు. క‌థ‌ను ఓన్ చేసుకుని చ‌క్క‌గా తెర‌కెక్కించారు. నాని అద్భుతంగా న‌టించాడు. ఈ చిత్రాన్ని ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌కు, చిత్ర‌బృందానికి ధన్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో హీరోయిన్స్ నివేధ థామ‌స్, సుర‌భి, అవ‌స‌రాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

More News

దిల్ రాజు ఆ ద‌ర్శ‌కుడితో సినిమా లేన‌ట్లే...?

మెగాబ్ర‌ద‌ర్ త‌న‌యుడు వ‌రుణ్ తేజ్, హీరోగా విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ముకుంద‌, కంచె, లోఫ‌ర్ వంటి డిఫ‌రెంట్ మూవీస్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు.

విజ‌య్ విల‌నే ప్ర‌భాస్ విల‌న్ అయ్యాడు...?

ప్రస్తుతం బాహుబలి2 చిత్రీకరణలో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  ఈ సినిమా తర్వాత రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని స‌మాచారం.

తేజు మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం తిక్క సినిమాలో న‌టిస్తున్నారు. సునీల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌తిక్క షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

చైతు బ‌రువు త‌గ్గాడు...

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా చందుమొండేటి ద‌ర్శ‌క‌త్వంలో అన్న‌పూర్ణ స్టూడియో  బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ప్రేమ‌మ్‌. మ‌ల‌యాళ చిత్రం ప్రేమ‌మ్‌కు ఇది రీమేక్‌. శృతిహాస‌న్‌,మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

చుట్టాల‌బ్బాయి ఆడియో డేట్

ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రంలో ఆది స‌ర‌స‌న న‌మిత‌, యామిని హీరోయిన్స్ గా న‌టించారు.