'జెంటిల్ మన్' రిలీజ్ డేట్....
Send us your feedback to audioarticles@vaarta.com
నాని హీరోగా నటించిన తాజా చిత్రం `జెంటిల్‌మన్`. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. 'అష్టా చమ్మా' తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత నాని,మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. ఇటీవల విడుదలైన తొలి టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మే 22న ఈ సినిమా పాటలను విడుదల చేసి జూన్ 10న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం నానికి మంచి బ్రేక్ తీసుకురావాలని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com