'జెంటిల్ మన్' రిలీజ్ డేట్....

  • IndiaGlitz, [Tuesday,May 17 2016]

నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం 'జెంటిల్‌మ‌న్‌'. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 'అష్టా చమ్మా' తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత నాని,మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్ర‌మిది. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా న‌టించారు. ఇటీవ‌ల విడుద‌లైన తొలి టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. మే 22న ఈ సినిమా పాటలను విడుదల చేసి జూన్ 10న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం నానికి మంచి బ్రేక్ తీసుకురావాలని ఆశిద్దాం.