రానా చేతుల మీదుగా జెంటిల్ మన్ ఆడియో విడుదల
Monday, May 23, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నాని హీరోగా నటించిన తాజా చిత్రం జెంటిల్మన్. ఈ చిత్రానికి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. అష్టా చమ్మా తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఆదిత్య 369, వంశానికొక్కడు చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా నటించారు. మణిశర్మ సంగీతాన్ని అందించిన జెంటిల్ మన్ ఆడియో ఆవిష్కరణోత్సవం హైదరాబాద్ శిల్పకళావేదికలో సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి బాహుబలి రానా ముఖ్య అతిధిగా హాజరై జెంటిల్ మన్ బిగ్ సీడిను, ఆడియో సీ.డీ ను ఆవిష్కరించి తొలి సీడీను సంగీత దర్శకుడు మణిశర్మకు అందచేసారు.
ఈ సందర్భంగా హీరో రానా మాట్లాడుతూ...ఈ చిత్రంలో నాని విలన్ గా అద్భుతంగా నటించి ఉంటాడు. జెంటిల్ మన్ ఆడియో, సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ...ఈ చిత్రంలో నేను హీరోనా, విలనా అనేది జూన్ 17న అందరికీ తెలుస్తుంది. నెగిటివ్ షేడ్ ఉన్న ఈ చిత్రంలో నటించడం..ఈ చిత్రానికి మణిశర్మ గారు సంగీతం అందించడం సంతోషంగా ఉంది. సురభి, నివేదా పాత్రకు తగ్గట్టు చాలా చక్కగా నటించారు. శ్రీనివాస్ అవసరాల లతో మరోసారి కలిసి నటించాను. త్వరలో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాను అన్నారు.
డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ...జయాపజయాల గురించి ఆలోచించకుండా నాతో సినిమా నిర్మించిన నిర్మాత కృష్ణ ప్రసాద్ గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. 2015లో నానికి ఓ కథ చెప్పాను. కథ విన్న వెంటనే ఓకే చెప్పాడు. నాని తప్ప ఇంకెవరూ ఈ కథకు న్యాయం చేయలేరు. మణిశర్మ గారితో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మంచి అర్ధవంతమైన పాటలు అందించారు. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ...ఈ మూవీ టీమ్ అందరికీ జెంటిల్ మన్ ఇంద్రగంటి మోహనకృష్ణ గారు. నాని కెరీర్ లో ముఖ్యమైన వ్యక్తి ఇంద్రగంటి మోహనకృష్ణ గారు. నాని, నేను ఎప్పుడు కలుసుకున్నా..నాని మోహన్ గారి గురించే చెబుతాడు. మణిశర్మ గారికి నేను పెద్ద అభిమానిని. నాని, మణిశర్మ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
సినిమాటోగ్రాఫర్ విందా మాట్లాడుతూ...నాని గారితో నాకు ఇది రెండో సినిమా. నాని అద్భుతమైన నటుడు. ఇంద్రగంటి గారు నాకు వరుసగా అవకాశాలు ఇస్తూ.. ప్రొత్సహిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత కృష్ణప్రసాద్ గారు ఎంతో ఫ్రీడం ఇచ్చారు. నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ రుణపడి ఉంటాను అన్నారు.
హీరోయిన్ సురభి మాట్లాడుతూ...ఇది నాకు స్పెషల్ మూవీ. హీరో నాని రియల్ జెంటిల్ మన్. నాకు చాలా సపోర్ట్ చేసాడు. ఈ చిత్రంలో నేను ఓ భాగమైనందుకు సంతోషంగా ఉంది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు.
అవసరాల శ్రీనివాస్ మాట్లాడుతూ...జెంటిల్ మన్ అంటే హీరో, విలన్ రెంటింటి లా ప్రవర్తించేవాడు. ఈ చిత్రంలో నాని జెంటిల్ మన్ అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ...నాని నాకు బ్రదర్ లాంటి వాడు. ఇంద్రగంటి గారి సినిమాలు చూసే నేను దర్శకుడిగా మారాను. ఈ మూవీ మ్యూజిక్ బాగుంది. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నానితో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను అన్నారు.
హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ...ఇంద్రగంటి మోహనకృష్ణ గారు మంచి టీచర్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నాని టెలెంట్డ్ ఏక్టర్. ఎలాంటి పాత్రలో అయినా నటించగలడు. మణిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ అందిస్తారు. బ్రిలియంట్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ హను రాఘవపూడి మాట్లాడుతూ...నాని ప్రతి సినిమాకి కొత్త సబ్జెక్ట్ ఎంచుకుంటాడు. ఈ చిత్రంతో నానికి సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ అవుతుంది అన్నారు.
నిర్మాత దామెదర ప్రసాద్ మాట్లాడుతూ...నాని మంచి నటుడు. వాస్తవానికి దగ్గరగా ఉంటాడు. కృష్ణప్రసాద్ గారు డెడికేషన్ ఉన్న నిర్మాత. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments