ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో జనరిక్ మెడికల్ షాపులు
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మెట్రో స్టేషన్‌లలో జనరికల్ మెడికల్ షాపులను అందుబాటులోకి తెచ్చింది హెచ్ఎంఆర్. మెట్రో రైలు, దవా దోస్త్‌తో భాగస్వామ్యంతో జనరిక్ ఔషధాలు, ఫార్మా ఉత్పత్తులను మెట్రో స్టేషన్‌లలో విక్రయించేందుకు ప్రత్యేక స్టోర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా తొలి స్టోర్‌ను ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే అమీర్‌పేట, కేపీహెచ్‌బీ, హైటెక్ సిటీ, ఎంజీబీఎస్ తదితర స్టేషన్‌లలో దవాదోస్త్ కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. ఈ జనరిక్ మెడికల్ షాపుల్లో 15 నుంచి 80 శాతం రాయితీ పొందవచ్చని ఎన్‌వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
కాగా.. హైదరాబాద్ మెట్రో రైలు నష్టాలతో ఇబ్బందులు పడుతోంది. కరోనా కారణంగా కొన్ని నెలలు మెట్రో సర్వీసులను నిలిపివేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైనా.. మధ్యలో సెకండ్ వేవ్ రాకతో మరోసారి ఇబ్బందులు తప్పలేదు. ఇక ఐటీ ఇతర ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా హైదరాబాద్‌కు దూరంగా వుండటంతో సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. గత త్రైమాసికంలో మెట్రో సంస్థకు రూ.445 కోట్ల నష్టం వచ్చిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments