మోగిన ఎన్నికల నగారా.. ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్
- IndiaGlitz, [Sunday,March 10 2019]
భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. పోలింగ్ తేదీలు, ఎన్నికల నిర్వహణ వివరాలను ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా వెల్లడించారు. మొత్తం 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలతోపాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 11న ప్రారంభమవుతుంది. మే 19న చివరి దశతో ముగుస్తుంది.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 7 విడతల్లో ఈ ఎన్నికలు జరగనుండగా.. ఏప్రిల్ 11న మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఇక.. ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 11న ప్రారంభమై.. మే 19న చివరి దశతో ముగుస్తుంది.
ఎన్నికలు ఇలా జరగనున్నాయ్..
మొత్తం 7 విడతల్లో 17వ లోక్‌సభ ఎన్నికలు
ఏప్రిల్ 11న తొలి విడత
ఏప్రిల్ 18న రెండో విడత
ఏప్రిల్ 23న మూడో విడత
ఏప్రిల్ 29న నాలుగో విడత
మే 6న ఐదో విడత
మే 12న ఆరో విడత
మే 19న ఏడో విడత
పోలింగ్ ప్రక్రియ జరగనుందిలా...
తొలి విడతలో 20 రాష్ట్రాల్లోని 91 నియోజకవర్గాల్లో పోలింగ్
రెండో విడతలో 13 రాష్ట్రాల్లోని 97 నియోజకవర్గాల్లో పోలింగ్
మూడో విడతలో 14 రాష్ట్రాల్లోని 115 నియోజకవర్గాల్లో పోలింగ్
నాలుగో విడతలో 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో పోలింగ్
ఐదో విడతలో 7 రాష్ట్రాల్లోని 51 నియోజకవర్గాల్లో పోలింగ్
ఆరో విడతలో 7 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్
ఏడో విడతలో 8 రాష్ట్రాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే...
ఏపీ, తెలంగాణలో ఏప్రిల్ 11న ఎన్నికలు
మార్చి 18న తొలి విడత ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్
మార్చి 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ
మార్చి 26న నామినేషన్ల పరిశీలన
నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 28 గడువు
మే 23న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. కాగా అదే రోజే ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
సోషల్ మీడియాకు ఎన్నికల కోడ్..
కేంద్ర ఎన్నికల కమిషనర్ మొత్తం 543 ఎంపీ స్థానాలు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. జూన్ 3తో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగియనున్నది. దేశ వ్యాప్తంగా 10 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల అభ్యర్థుల సోషల్ మీడియా ప్రకటనలకు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని.. సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం కాకుండా గట్టి చర్యలు చేపట్టామని చెప్పారు. దేశవ్యాప్తంగా 90కోట్ల ఓటర్లు ఉన్నారని అందులో తొలిసారి ఓటు వేసే వారు 1.5 కోట్ల మంది అని సీఈవో తెలిపారు. 99.36 శాతం మంది ఓటర్లు గుర్తింపు కార్డులు ఉన్నాయన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల ద్వారానే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి 12 రకాల గుర్తింపు కార్డులను అనుమతిస్తామని.. ఫొటో ఓటరు స్లిప్‌ను గుర్తింపు కార్డుగా పరిగణించబోమని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్- 1950కి కాల్ చేసి ఓటు సరిచూసుకోవచ్చని సీఈసీ ప్రకటించారు.