జెనీలియా రీ ఎంట్రీ...

  • IndiaGlitz, [Saturday,December 02 2017]

బాయ్స్ స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించిన జెనీలియాకు తెలుగు, త‌మిళంలో మంచి పేరు తెచ్చిన సినిమా 'బొమ్మ‌రిల్లు'. హ హ హాసినిగా జెనీలియా ఇంకా గుర్తుంది. బాలీవుడ్‌లో కూడా హీరోయిన్‌గా మంచి విజ‌యాల‌ను జెనీలియా సొంతం చేసుకుంది. త‌ర్వాత బాలీవుడ్ న‌టుడు రితీష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని సినిమాల‌కు బ్రేక్ ఇచ్చేసింది.

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా మారిన త‌ర్వాత జెనీలియా మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డానికి ఆసక్తిని క‌న‌ప‌రుస్తుంది. ఇటీవ‌ల ఓ మ‌రాఠీ చిత్రంలో అతిథి పాత్ర‌లో న‌టించిన జెనీలియా మ‌రో మ‌రాఠీ చిత్రంతో పాటు ఓ ద‌క్షిణాది చిత్రంలో కూడా న‌టించ‌బోతున్న‌ట్లు రీసెంట్‌గా జ‌రిగిన ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలోతెలియ‌సింద‌ట‌.

మ‌రి జెనీలియా రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న ద‌క్షిణాది చిత్ర‌మేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..

More News

సాయిధరమ్ తేజ్ తో పనిచేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే - ప్రసన్న

'జవాన్' సినిమాలో కేశవ అనే క్యారెక్టర్ కోసం రవిగారు కొత్త నటుడు కావాలని వెతుకుతున్నప్పుడు రచయితలు గోపీమోహన్, కోన వెంకట్ లు నా పేరును రవికి చెప్పారు.

డిసెంబర్ 28న 'ఒక్క క్షణం' ?

అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఒక్క క్షణం’. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ రూపొందించిన ఈ సినిమా మంచి కథా కథనంతో ఆసక్తిగా ఉంటుందని వినికిడి.

శ్రీపతి కర్రి దర్శకత్వంలో వస్తున్న'హల్ చల్' ఫస్ట్ లుక్ విడుదల

శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీపతి కర్రి దర్శకత్వంలో గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న చిత్రం హల్ చల్. రద్రాక్ష్ ఉత్కమ్, ధన్యా బాలకృష్ణ జంటగా నటిస్తున్నారు.

డ‌బ్బింగ్ చెప్పుకుంటోన్న బాల‌య్య హీరోయిన్‌...

ఇప్పుడు తారామ‌ణులంద‌రూ సొంత గొంతుక‌తో డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డానికి ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నారు. రాశిఖ‌న్నాలాంటి కొంద‌రు హీరోయిన్స్ అయితే ఏకంగా పాట‌లు కూడా పాడేస్తున్నారు.

హ‌లో' ట్రైల‌ర్ రివ్యూ...

అక్కినేని అఖిల్ హీరోగా అన్న‌పూర్ణ స్టూడియోస్‌, మ‌నం ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై నిర్మిత‌మవుతున్న చిత్రం 'హ‌లో'. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకు విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌కుడు.