హ హ హాసిని రీ ఎంట్రీ..

  • IndiaGlitz, [Monday,December 03 2018]

బాయ్స్, బొమ్మ‌రిల్లు స‌హా ప‌లు చిత్రాల్లో న‌టించిన జెనీలియాకు తెలుగు, త‌మిళ చిత్రాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపును సంపాదించుకుంది. బాలీవుడ్‌లో బాలీవుడ్‌లో కూడా హీరోయిన్‌గా మంచి విజ‌యాల‌ను జెనీలియా సొంతం చేసుకుంది.

త‌ర్వాత బాలీవుడ్ న‌టుడు రితీష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకుని సినిమాల‌కు బ్రేక్ ఇచ్చేసింది. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా మారిన త‌ర్వాత జెనీలియా మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డానికి ఆసక్తిని క‌న‌ప‌రుస్తుంది.

మ‌రాఠీ చిత్రం 'మౌలి'లో ఓసాంగ్‌లో భ‌ర్త రితేష్ దేశ్‌ముఖ్‌తో క‌లిసి న‌టించింది జెనీలియా. అంతే కాకుండా అవ‌కాశాలు వ‌స్తే మ‌ళ్లీ ద‌క్షిణాది సినిమాల్లో న‌టించ‌డానికి తాను సిద్ధ‌మ‌ని ఇటీవ‌ల ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో కూడా చెప్పుకొచ్చింది.

More News

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో

'రాజా రాణి' వంటి క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీతో స‌క్సెస్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు అట్లీ. ఆ త‌ర్వాత విజ‌య్‌తో 'తెరి' వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాను తెర‌కెక్కించి హిట్‌ను సొంతం చేసుకున్నాడు.

ద‌ర్శ‌కుడికి నో చెప్పిన సాయిప‌ల్ల‌వి

'ఫిదా', 'ఎంసిఎ' చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సాయిప‌ల్ల‌వి.. ఇప్పుడు త‌మిళంలో కూడా వ‌రుస సినిమాలు చేస్తుంది. అయితే ప్రాధాన్యం ఉన్న పాత్ర‌లు చేయ‌డానికే ఆస‌క్తి చూపుతుంది సాయిప‌ల్ల‌వి.

వాయిదాల వ‌ర్మ‌

వివాదాల వ‌ర్మ ఇప్పుడు వాయిదాల వ‌ర్మ‌గా మారిపోయాడా? అవునేమో అనిపిస్తుంది. త‌న సినిమా త‌న‌దే.. ఎవ‌రికీ ఆన్స‌ర్ చెప్ప‌ను అన్న‌ట్లుండే వ‌ర్మ ఇప్పుడు భైర‌వ‌గీత సినిమాను వాయిదాలు వేసుకుంటూనే వ‌స్తున్నాడు.

నాగ‌శౌర్య‌తో చైతు హీరోయిన్‌...

అక్కినేని నాగ‌చైత‌న్య‌తో 'స‌వ్య‌సాచి'లో న‌టించిన నిధి అగ‌ర్వాల్ ఇప్పుడు నాగ‌శౌర్య‌తో క‌లిసి న‌టించ‌నుంది.

ముంబైకి సోనాలి బింద్రే

కొంత కాలంగా క్యాన్స‌ర్‌తో ఇబ్బంది పోరాడుతున్న న‌టి సోనాలి బింద్రే న్యూయార్క్‌లో కీమోథెర‌పీ చికిత్స చేయించుకుంటున్నారు.