'మ‌హాన‌టి' పై జెమినీ కుమార్తె ఆరోప‌ణ‌లు...

  • IndiaGlitz, [Thursday,May 17 2018]

అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'. కీర్తిసురేశ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం తెలుగు, త‌మిళంలో విడుద‌లైంది. ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని విజ‌య‌వంత‌గా ముందుకెళ్తోంది.

ఇలాంటి త‌రుణంలో జెమినీ గ‌ణేశ‌న్ పెద్ద కుమార్తె డాక్ట‌ర్ క‌మ‌లా సెల్వ‌రాజ్ సినిమాలో త‌న తండ్రి పాత్ర చిత్రీక‌రించిన తీరుపై ఆరోప‌ణ‌లు చేశారు. ఓ త‌మిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో ఆమె మ‌హాన‌టి గురించి వివ‌రాల‌ను చెప్పుకొచ్చారు. ఎం.జి.ఆర్‌, శివాజీ గ‌ణేశ‌న్ ల‌తో పాటు త‌న తండ్రి స్టార్ న‌టుడిగా ఎదిగారు. అలాంటి వ్య‌క్తిని చిన్న చిన్న ప‌నులు చేసుకునే వ్య‌క్తిగా, కించప‌రిచేలా చిత్రీక‌రించార‌ని ఆమె ఆరోపించారు.

అంతే కాకుండా సావిత్రికి మ‌ద్యం అల‌వాటు చేసింది త‌న తండ్రి అని చూపించ‌డం బాధించింద‌ని తెలిపారు. 'ప్రాప్తం' సినిమాన స‌మ‌యంలో తండ్రితో క‌లిసి తాను కూడా సావిత్రిని క‌ల‌వ‌డానికి వెళితే వాచ్‌మెన్‌తో గెంటేయించింద‌ని తెలిపారు.

More News

కీర్తి సురేష్ హ్యాట్రిక్

‘నేను శైలజ’ సినిమాతో తెలుగు తెర‌కు కథానాయికగా పరిచయమైన కేర‌ళ కుట్టి కీర్తి సురేష్.

డ‌బ్బింగ్ మొద‌లు పెట్టిన చిరంజీవి అల్లుడు

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ల్యాణ్ దేవ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే.

అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ 'నేల టిక్కెట్టు' ట్రైలర్‌

మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్లు ఉంటాయి.

ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం చేసిన డైరెక్ట‌ర్‌....

ర‌చ‌యిత, డైరెక్ట‌ర్ రాజ‌సింహా ముంబైలోని త‌న రూమ్‌లో ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం చేశారు. సందీప్‌కిష‌న్‌, నిత్యామీన‌న్ న‌టించిన 'ఒక్క అమ్మాయి త‌ప్ప' సినిమాను డైరెక్ట్ చేసిన రాజ‌సింహ

రాజ‌మౌళి చిత్రానికి కంటే ముందు..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వాని జంటగా యాక్షన్ చిత్రాల‌ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.