'మహానటి' పై జెమినీ కుమార్తె ఆరోపణలు...
Send us your feedback to audioarticles@vaarta.com
అలనాటి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మహానటి'. కీర్తిసురేశ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలైంది. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని విజయవంతగా ముందుకెళ్తోంది.
ఇలాంటి తరుణంలో జెమినీ గణేశన్ పెద్ద కుమార్తె డాక్టర్ కమలా సెల్వరాజ్ సినిమాలో తన తండ్రి పాత్ర చిత్రీకరించిన తీరుపై ఆరోపణలు చేశారు. ఓ తమిళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె మహానటి గురించి వివరాలను చెప్పుకొచ్చారు. ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్ లతో పాటు తన తండ్రి స్టార్ నటుడిగా ఎదిగారు. అలాంటి వ్యక్తిని చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తిగా, కించపరిచేలా చిత్రీకరించారని ఆమె ఆరోపించారు.
అంతే కాకుండా సావిత్రికి మద్యం అలవాటు చేసింది తన తండ్రి అని చూపించడం బాధించిందని తెలిపారు. 'ప్రాప్తం' సినిమాన సమయంలో తండ్రితో కలిసి తాను కూడా సావిత్రిని కలవడానికి వెళితే వాచ్‌మెన్‌తో గెంటేయించిందని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments