పక్కా.. అవి పోర్న్ వీడియోలే.. కాదు చెక్ చేసుకోండి అంటున్న హాట్ బ్యూటీ
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ ఒక వివాదాల పుట్ట. దేశాన్ని కుదిపేసే సంఘటనలకు బాలీవుడ్ తో ఎప్పుడూ లింక్ ఉంటుంది. ఈ విషయాన్ని చరిత్ర స్పష్టం చేస్తోంది. మరోమారు రాజ్ కుంద్రా వ్యవహారంతో బాలీవుడ్ లో జరుగుతున్న చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. పోర్న్ చిత్రాల మేకింగ్ వ్యవహారంలో ముంబై పోలీసులు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారంలో ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. పోర్న్ చిత్రాలు నిర్మించి హాట్ షాట్స్ అనే యాప్ ద్వారా రిలీజ్ చేస్తున్నారనే ఆరోపణలతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రాజ్ కుంద్రాని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం మొత్తం లండన్ వేదికగా రాజ్ కుంద్రా కజిన్ సహాయంతో జరుగుతోంది అని పోలీసులు గుర్తించారు.
ఈ వివాదంలో శృంగార తార, మోడల్ గెహెనా వసిస్ట్ పేరు కూడా వినిపిస్తోంది. పోలీసులు ఆమెని కూడా విచారిస్తున్నారు. రాజ్ కుంద్రా నిర్మించే చిత్రాల్లో గెహెనా వసిస్ట్ కూడా నటిస్తోంది అని అంటున్నారు. రాజ్ కుంద్రా తాను ఎలాంటి తప్పు చేయలేదని వాదిస్తున్నప్పటికీ పోలీసులు భిన్నంగా స్పందించారు.
రాజ్ కుంద్రా నిర్మిస్తున్నవి పోర్న్ చిత్రాలే అని, తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు. రాజ్ కుంద్రా ఆఫీస్ ని రైడ్ చేసినప్పుడు తాము ఆధారాలు సేకరించామని ముంబై పోలీసులు అంటున్నారు.
వివాదాస్పద నటి గెహెనా వాదన మరోలా ఉంది. అవి పోర్న్ చిత్రాలే కాదు అని అంటోంది. ముందుగా శృంగారానికి, అస్లీలతకు తేడా తెలుసుకోవాలి. ఏక్తా కపూర్ లాంటి వారు చిత్రీకరించే బోల్డ్ విడియోల్లాంటివే తమ చిత్రాలు అని గెహెనా పేర్కొంది.
తాము చేసిన వీడియోల్లో ఒక్కటి కూడా పోర్న్ కాదని అంటోంది. తమని విమర్శించేవారు ఆ వీడియోల్ని చూసి తర్వాత మాట్లాడాలని కోరింది. కొందరు కావాలనే రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి, తనని టార్గెట్ చేస్తూ విమరిస్తున్నారని వాపోయింది. తనకు ముంబై పోలీసులపై పూర్తి విశ్వాసం ఉందని నిజానిజాలు బయటకు వస్తాయని, తమపై ఉన్న ఆరోపణలు తొలగిపోతాయని గెహెనా వసిస్ట్ పేర్కొంది. గంధీ బాత్ అనే బోల్డ్ వీడియోలతో గెహెనా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments