గీతూ ఎలిమినేషన్.. హౌస్‌లో ఉద్విగ్న వాతావరణం, నాగార్జున సైతం కంటతడి
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6లో ప్రేక్షకులను , కంటెస్టెంట్స్‌ను చివరికి హోస్ట్ నాగార్జునను కూడా కంటతడి పెట్టించింది ఈ రోజు ఎపిసోడ్. స్ట్రాటజీ అనుకోండి, కన్నింగ్‌నెస్ అనుకోండి ఏది ఏమైనా గేమ్‌లో గెలవడమే లక్ష్యంగా ఆడిన గలాటా గీతూ ఈ వారం ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యింది. తాను హౌస్‌ని వీడి వెళ్లనని.. ఇక్కడే వుంటానంటూ గీతూ స్టేజ్‌పైకి వెళ్లే వరకు ఏడుస్తూనే వుంది. అసలు ఈ రోజు ఇంటిలో ఏం జరిగిందో ఒకసారి చూస్తే:
నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రావడంతోనే హౌస్‌మేట్స్‌తో పాము నిచ్చెన అనే ఆట ఆడించారు. పాము బొమ్మను పెట్టి ఎవరినైతే మీరు పాము అనుకుంటున్నారో వారిని ఆ ప్లేస్‌లో నిలబెట్టి రీజన్ చెప్పాలని నాగ్ ఆదేశించారు.
అలా ఎవరు ఎవరికి ఏమిచ్చారంటే :
బాలాదిత్య : గీతూ పాము, ఆదిరెడ్డి నిచ్చెన
ఆదిరెడ్డి : శ్రీహాన్ పాము, గీతూ నిచ్చెన
గీతూ : బాలాదిత్య పాము, ఆదిరెడ్డి నిచ్చెన
ఫైమా : ఇనయా పాము, గీతూ నిచ్చెన
ఇనయా : ఆదిరెడ్డి పాము, గీతూ నిచ్చెన
రాజ్ : ఆదిరెడ్డి పాము, ఫైమా నిచ్చెన
రోహిత్ : గీతూ పాము, మెరీనా నిచ్చెన
శ్రీహాన్ : ఇనయా పాము, రేవంత్ నిచ్చెన
రేవంత్ : వాసంతి పాము, శ్రీహాన్ నిచ్చెన
వాసంతి : శ్రీహాన్ పాము, ఆదిరెడ్డి నిచ్చెన
కీర్తి : శ్రీహాన్ పాము, మెరీనా నిచ్చెన
మెరీనా : గీతూ పాము, ఆదిరెడ్డి నిచ్చెన
శ్రీసత్య : ఫైమా పాము, గీతూ నిచ్చెన
తర్వాత నామినేషన్స్‌లో వున్న రేవంత్, కీర్తి, ఆదిరెడ్డిలను నిన్ననే సేఫ్ చేసిన నాగార్జున ఈరోజు మెరీనా, బాలాదిత్య, ఇనయా, ఫైమా, రోహిత్‌లను సేవ్ చేశారు. చివరికి శ్రీసత్య, గీతూలు మాత్రమే మిగలగా.. శ్రీసత్య సేవ్ అయ్యిందని, గీతూ ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు. ఆ మాట వినగానే గీతూ సహా హౌస్‌మేట్స్ అంతా షాక్ అయ్యారు. గీతూ అయితే తాను ఎలిమినేట్ అయ్యాననే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. తనని పంపించవద్దని బతిమలాడింది. హౌస్‌లో తనకు ఇష్టమైన ప్లేస్‌లలో కాసేపు కూర్చొని వచ్చి గార్డెన్ ఏరియాలో నిలబడి బోరున ఏడ్చేసింది. ఐ లవ్ యూ బిగ్‌బాస్ .. నీకు జీవితాంతం రుణపడి వుంటానని, తనకు మరో లైఫ్ ఇచ్చవంటూ గీతూ ఏడుస్తూనే చెప్పింది. ఆ మాటలతో గీతూతో ప్రతిరోజూ గొడవపడే రేవంత్ ఆమెను గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. రేవంత్, శ్రీహాన్, ఫైమా, రాజ్ సైతం కంటతడిపెట్టారు.
స్టేజ్‌పైకి వెళ్లగానే తనను పంపించవద్దని నాగార్జునను పట్టుకుని ఏడ్చింది. ఆమెను ఓదార్చలేక ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారు. హౌస్‌మేట్స్ సైతం ఎలిమినేషన్ ఆపాలని కోరగా.. తన చేతిలో ఏం వుండదని, బిగ్‌బాస్ ఆర్డర్ పాటించాల్సిందేనని చెప్పేశాడు. అనంతరం స్టేజ్‌పై తనకు షో మేకర్స్ ఎవరు, షో బ్రేకర్స్ ఎవరు అనేది చెప్పాలని నాగ్ కోరగా... ఆదిరెడ్డి, ఫైమా, శ్రీహార్, శ్రీసత్య, రేవంత్‌లను షో మేకర్స్ అని.. బాలాదిత్య, ఇనయా, కీర్తి, వాసంతి, మెరీనా, రోహిత్‌లు షో బ్రేకర్స్ అని చెప్పింది. చివరిగా తన ఫ్రెండ్ కోసం రేవంత్.. వాలు కనుల దానా అనే పాట పాడి డెడ్‌కేట్ చేశాడు. అనంతరం గీతూ అందరికి వీడ్కోలు చెప్పి హౌస్‌ను వీడింది.
మొత్తం మీద బిగ్‌బాస్ తెలుగు చరిత్రలోనే ఏ ఎలిమినేషన్ సమయంలోనూ కనిపించనంత నాటకీయత గీతూ ఎలిమినేట్ అయినప్పుడు చోటు చేసుకుంది. ఆమె ఎలిమినేషన్ అందరినీ అంతలా బాధించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments