BiggBoss: అమ్మో... ఇంత కన్నింగా, ఒక్క చేపతో ఆటను మలుపు తిప్పిన గీతూ
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ 6 సీజన్ ప్రారంభమయ్యాక తొలి రెండు వారాల పాటు వన్ మాన్ షో చేసింది గీతూ. తన చిత్తూరు యాసతో పాటు ఆటతీరు, స్ట్రాటజీతో హౌస్‌ని నడిపించి తన కంటూ సపరేట్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకుంది. మధ్యలో ఇనయా వచ్చి హడావుడి చేసినా.. ఇప్పటికీ గీతూ స్ట్రాంగ్ కంటెస్టెంటే. తాజాగా హౌస్‌లో జరిగిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో గీతూ పాప మరోసారి తన కన్నింగ్ క్యారెక్టర్ చూపించింది. ఇంటి సభ్యులందరినీ జంటలుగా విభజించి ‘‘చేపల చెరువు’’ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్ మధ్య మధ్యలో తక్కువ చేపలు వున్న వారిని పక్కకి పెడుతున్నాడు. అలా గీతూ- ఆదిరెడ్డి జంట వద్ద తక్కువ చేపలు వుండటంతో వారిని కెప్టెన్సీ పోటీదారుల నుంచి తప్పించాడు. దీంతో గీతూ నిన్న వెక్కి వెక్కి ఏడ్చింది. కానీ ఇవాళ మాత్రం తనదే పైచేయిగా చేసుకుంది.
చేపల చెరువు టాస్క్‌కి రెండో రోజు సంచాలక్‌గా గీతూ- ఆదిరెడ్డిలను నియమించాడు బిగ్‌బాస్. దొంగ చేతికి తాళం అప్పగిస్తే.. వాడు వూరుకుంటాడా, ఇప్పుడు గీతూని సంచాలక్‌ని చేసినా రిజల్ట్ ఒకటే . గేమ్ ప్రారంభమవ్వగానే.. ఇంటి సభ్యులతో కలిసి గీతూ కూడా చేపలు ఏరుకోవడం మొదలుపెట్టింది. దీనికి ఆదిరెడ్డి అడ్డుచెప్పినా పట్టించుకోలేదు. కానీ రేవంత్ మాత్రం గట్టిగా నిలబడ్డాడు. సంచాలక్‌గా వుండి చేపలు పట్టడాన్ని తప్పుపట్టాడు. దీనికి తన పవర్‌తో బెదిరించే ప్రయత్నం చేసింది గీతూ. తనతో వాదిస్తే డిస్ క్వాలిఫై చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చింది. అంతేనా మైక్‌తో పాటు పూల్ దిగినందుకు శిక్షగా పది చేపలు లాక్కుంది.
శ్రీహాన్, సూర్య, బాలాదిత్యలు కూడా గట్టిగానే పోరాడారు. అయినా గీతూ- రేవంత్ మాటల యుద్ధమే ఈ రోజు హైలైట్‌గా నిలిచింది. నేడు గోల్డ్ కాయిన్ ఫైమాకు దక్కడంతో తనతో పోటీపడేందుకు ఆమె మూడు జంటల్ని ఎంచుకునే పవర్ వచ్చింది. దీంతో బాలాదిత్య- మెరీనా, సూర్య- వాసంతి, శ్రీహాన్- శ్రీసత్యలను ఎంపిక చేసుకకుంది ఫైమా. ఈ గేమ్‌కు రేవంత్‌ని సంచాలక్‌గా ఎంచుకుంది. గేమ్ ఏంటంటే ... జంటలోని ఒకరు అక్కడ వుంచిన ఆక్వేరియాన్ని నీటితో నింపుతూ వుంటారు. మిగిలిన సభ్యులు వారిని అడ్డుకోవాలి. ఆటముగిసే సరికి ఏ జంట ఆక్వేరియంలో ఎక్కువ నీళ్లు వుంటే ఆ జంట గెలుస్తుంది. ఈ ఛాలెంజ్‌లో సూర్య - వాసంతి జోడి విన్నర్‌గా నిలిచింది.
ఇక.. ‘‘చేపల చెరువు’’ టాస్క్‌లో భాగంగా అందరి వద్దా వున్న చేపలను సంచాలక్స్ అయిన ఆదిరెడ్డి, గీతూ లెక్కించారు. 129 చేపలను సంపాదించి ఇనయా - రేవంత్‌లు టాప్‌లో నిలిచారు. దీంతో వీరిద్దరిలో ఒకరు కెప్టెన్ అవుతారని అంతా భావించారు. ఇక్కడే పెద్ద షాకిచ్చాడు బిగ్‌బాస్. ఇంట్లోకి ఒక నల్ల చేప వచ్చిందని.. దాని సాయంతో రెండు జంటల బాస్కెట్లను స్వాప్ చేయొచ్చని చెప్పాడు. అప్పటి దాకా సైలెంట్‌గా వున్న గీతూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ.. తనకేదో బ్రహ్మాస్త్రం దొరికినట్లుగా సంబరపడిపోతూ... రేవంత్- ఇనయా, శ్రీహాన్ - శ్రీసత్య జంటల్ని స్వాప్ చేస్తున్నట్లుగా ప్రకటించి తనకు అడ్డొచ్చిన రేవంత్‌పై పగ తీర్చుకుంది. దీంతో శ్రీహాన్ - శ్రీసత్య టాప్‌లోకి వచ్చారు.
ఈ పరిణామంతో రేవంత్, ఇనయాల కోపం నషాళానికి అంటింది. అంత కష్టపడి ఆడితే గీతూ ఒకే ఒక్క చేపతో తమను గేమ్ నుంచి సైడ్ చేయడం వారిద్దరికి నచ్చలేదు. అయితే ఇక్కడ గేమ్‌లో పాల్గొని చేపల్ని ఏరాల్సింది కంటెస్టెంట్స్, వుంటే గింటే వాళ్ల దగ్గర నల్ల చేప వుండాలి. కానీ సంచాలక్ దగ్గర ఎలా చేరింది. ఆటను పర్యవేక్షించడం, నిబంధనల్ని ఆటగాళ్లు ఉల్లంఘించకుండా చూడటమే సంచాలక్ పని.. మరి గీతూ వద్దకు నల్ల చేప ఎలా చేరిందన్నదే ఇక్కడ ట్విస్ట్. మరి దీనిపై ఏం జరుగుతుందో.. ఫైనల్‌గా ఎవరు కెప్టెన్సీ బరిలో నిలవనున్నార తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments