Bigg Boss: బిగ్‌బాస్ రూల్స్ మార్చేసిన గీతూ.. నాగార్జునకే చురకలేసిన శ్రీసత్య
Send us your feedback to audioarticles@vaarta.com
బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలు లేవు.. జనాలకు సరైన కంటెంట్ దొరక్క బోర్ కొడుతుందంటూ హోస్ట్ నాగార్జున నుంచి విమర్శకుల వరకు ఈ సీజన్ కంటెస్టెంట్స్‌పై విరుచుకుపడుతున్నారు. ఈ దెబ్బకు జడుసుకున్నారో ఏమో కానీ... ఇంటి సభ్యుల్లో ఈ సోమవారం నుంచి మార్పు కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ నోటికి పనిచెప్పి.. మొహమాటానికి గుడ్‌బై చెప్పేశారు. నామినేషన్ల సమయంలో ఈ మార్పు కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇది మంగళవారం కూడా కంటిన్యూ అయ్యింది. ఇప్పటి వరకు సైలెంట్‌గా వున్న క్యూట్ యాంకర్ నేహా చౌదరి.. ఇంటి సభ్యులకు ఓ రేంజ్‌లో ఇచ్చిపడేశారు. తనను రేవంత్ పునుగులు, నూడిల్స్ అని పిలుస్తున్నాడని .. తనకు ఆ మాటలు అస్సలు నచ్చడం లేదని ఫైరయ్యింది. ఆ తర్వాత మన రివ్యూ బ్యాచ్ ఆదిరెడ్డి- గలాటా గీతూలు ముచ్చట్లు చెప్పుకున్నారు. ఈ సమయంలో ఇనయాను గీతూ తిక్కదెయ్యమని వ్యాఖ్యానించింది. ఆదిరెడ్డి కూడా ఆమె వేస్ట్, వరస్ట్, మాట్లాడటం కూడా రాదని, కెమెరా ఫోకస్ కోసం ఏదో ఒకటి చేస్తూ వుంటుందని కామెంట్ చేశాడు. అనంతరం శ్రీసత్య ఎంట్రీ ఇస్తూ తాను డబ్బు కోసమే బిగ్‌బాస్‌కి వచ్చానని.. మీరు కోరుకుంటున్న కంటెంట్‌ని తాను క్రియేట్ చేయలేనని తేల్చిచెప్పింది.
ఇదిలావుండగా.. ఈవారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌ను ఇచ్చారు బిగ్‌బాస్. అడవిలో దొంగలు అనే పేరుతో ఇచ్చిన ఈ టాస్క్‌లో భాగంగా ... అడవిలో కొన్ని వస్తువులుంటాయి. వాటిని దొంగలు దొంగిలించి కూడబెట్టాల్సి వుంటుంది. వాటిని వ్యాపారి వద్ద ఎక్కువ మొత్తానికి అమ్ముకోవాలి. దొంగతనం జరగకుండా పోలీసులు అడ్డుకోవాలి. ఇంటి సభ్యుల్ని పోలీసులు, దొంగలు కింద రెండు గ్రూపుల కింద విభజించారు. ఆదిరెడ్డి, చంటి, ఆదిత్య, రోహిత్, రాజ్, ఫైమా, శ్రీసత్య పోలీసులుగా... రేవంత్, నేహ, కీర్తి, శ్రీహాన్, సూర్య, అర్జున్, వాసంతి, ఆరోహి దొంగల గ్రూప్‌లో వున్నారు. అత్యాశ ఉన్న వ్యాపారస్తురాలిగా గీతూని పోలీస్‌ల హెడ్ గా ఆదిరెడ్డిని.. దొంగల హెడ్‌గా సూర్యని ఎంపిక చేశారు.
ఇక ఆట ప్రారంభం కాకుండానే గీతూ స్ట్రాటజీలు ప్లే చేసింది. బొమ్మలు కొనుక్కోకుండానే..కొన్నానని చెబుతా, నువ్వేం వీడియో చూపించవు కదా అని బిగ్‌బాస్‌ని ప్రశ్నించింది. ఇక గేమ్ స్టార్టయ్యింది. పోలీసులకు బాస్‌గా వున్న ఆదిరెడ్డి కూడా స్కెచ్‌లు వేశాడు. దొంగల మాదిరిగానే మనం కూడా బొమ్మల్ని దాచిపెట్టుకుని, వాళ్లని బోల్తా కొట్టించాలని చెప్పాడు. ఆరోహి పోలీసులకు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తానని చెప్పి... దొంగల టీమ్‌లో వున్న ఫైమాతో బేరం కుదుర్చుకుంది. అయితే దొంగల్ని పట్టుకునే క్రమంలో ఆట కాస్త ఫిజికల్‌గా మారింది. నేహా కాళ్లను బాలాదిత్య పట్టుకోవడంతో ఆమె కిందపడిపోయింది. వద్దు వద్దు అని ఆదిరెడ్డి ఎంతగా మొత్తుకున్నా.. టాస్క్ ఫిజికల్ ఎటాక్‌గా మారిపోయింది. ఈ క్రమంలో శ్రీహాన్- ఇనయాల మధ్య పెద్ద గొడవ జరిగింది.
ఇనయా వాడు వీడు అనడంతో.. శ్రీహాన్ రెచ్చిపోయాడు. మధ్యలో జోక్యం చేసుకున్న రేవంత్ .. తనను కూడా ఏదో అందని చెత్తది అంటూ కామెంట్ చేశాడు. దీనికి ఇనయా రెచ్చిపోయింది. ఎలా కొడతావో చెప్పు చూపించు అంటూ ఫైర్ అయ్యింది. మొన్ననే అంటే అప్పుడు అడగాలని.. ఇప్పుడు రెచ్చిపోవడం ఏంటని మండిపడింది. చివరికి శ్రీహాన్‌కు సారీ చెప్పింది ఇనయా. అయితే గీతూ బిగ్‌బాస్ రూల్స్‌కి బదలు గీతూ తన పర్సనల్ రూల్స్‌తో గేమ్ ఆడటాన్ని శ్రీ సత్య పసిగట్టింది. ఇక్కడ రూల్ బుక్ ఎందుకు ... ఆమెతోనే గేమ్ ఆడుకోండి . ఇలా అడ్డదిడ్డంగా ఆడుతున్నందుకేనా చప్పట్లు కొడుతున్నారంటూ నాగార్జునకే చురకలేసింది శ్రీ సత్య.
బిగ్‌బాస్ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో గీతూ తనకు నచ్చినట్లు ఆడింది. టాస్క్‌లో భాగంగా రేవంత్, శ్రీహాన్‌లు తమ దగ్గర వున్న బొమ్మల్ని గీతూకి అమ్మారు. రెడ్ ట్యాగ్ వున్న బొమ్మలు మాత్రమే కొనాలనే కండీషన్ వుండటంతో.. రేవంత్ ఓ ప్లాన్ వేశాడు. టవల్‌లో నుంచి కొన్ని దారాలను తీసి రెడ్ ట్యాగ్ మాదిరిగా బొమ్మలకు చుట్టాడు. ఇక మొత్తంగా గీతూ మరోసారి హైలైట్ అవ్వగా.. రేవంత్, శ్రీహాన్, శ్రీసత్యలు చురుగ్గా కనిపించారు. రేపు కూడా గేమ్ హుషారుగా సాగే సూచనలు వుండటంతో ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout