చిన్న చిత్రాలకు .. శత గీతగోవిందం
Send us your feedback to audioarticles@vaarta.com
వెండితెర పై ఇప్పటి వరకు చాలా ప్రేమకథలు చూశాం. కొత్తగా ఉండే ప్రేమకథా చిత్రాలు విజయం సాధించాయి. రొటీన్ స్టోరీలు కనబడకుండాపోయాయి. అయినా దర్శకులు ప్రేమకథలతో ప్రేక్షకులని మెప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నాల్లో 'గీత గోవిందం' ఒకటి. 2018 ఆగస్టు 15న విడుదలై అఖండ విజయాన్ని సాధించింది.అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ ఎలాంటి సినిమాను ఎంచుకుంటాడని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.
విజయ్ మాత్రం ఈ సారి సోలో, శ్రీరస్తు శుభమస్తు లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లను తెరకెక్కించిన పరశురామ్ దర్శకత్వంలో గీత గోవిందం పేరుతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గీతా ఆర్ట్స్ పతాకం పై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి 100రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం వచ్చిన చిన్న చిత్రాల్లో పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా ఇంతటి హిట్ సాధించి బ్యానర్‌కే మంచి విలువను తీసుకొచ్చింది.
అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్లో మరో కమర్షియల్ బ్లాక్‌బస్టర్ గీత గోవిందం. తొలిసారిగా పరశురామ్‌గా కూడా తన కెరీర్లో కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటికే మంచి వసూళ్లు లభించిన ఈ చిత్రం సక్సెస్ఫుల్ డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ల జాబితాలో చేరింది. 2018లో బెస్ట్ మూవీగా నిలబడింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ చిత్రంలోని ఇంకేం ఇంకేం ఇంకేంకావాలే అన్నపాట మంచి మ్యూజికల్ హిట్ అయింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా విజయాన్ని సాధించింది.
విజయదేవరకొండ, రష్మిక మందాన నటించిన ఈ చిత్రానికి దర్శకత్వంః పరశురామ్, నిర్మాతఃబన్నీ వాసు, సంగీతంఃగోపీ సుందర్, నిర్మాణ సంస్థఃగీతా ఆర్ట్స్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com