సుకుమార్‌తో గీతాఆర్ట్స్ సినిమా

  • IndiaGlitz, [Tuesday,February 09 2016]

నాన్న‌కు ప్రేమ‌తో స‌క్సెస్ తర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాంచ‌రణ్ హీరోగా సినిమా ఉంటుంద‌ని మ‌న‌కు తెలిసిందే. అయితే ఈ సినిమాను ఎవ‌రు నిర్మిస్తార‌నేది తెలియడం లేదు కానీ ఓ క్లియ‌ర్ ఐడియా అయితే వ‌స్తుంది. ఈ సినిమాను కూడా గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లుఅర‌వింద్ నిర్మించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తుంది.

ఎందుకంటే రీసెంట్‌గా సుకుమార్‌ను పిలిచి అల్లుఅర‌వింద్ ఏప్రిల్ నుండి గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌మ‌ని అన్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని సుకుమార్ చెప్ప‌డం విశేషం. అంటే ఇది వ‌ర‌కు రాంచ‌ర‌ణ్‌తో సుక్కు మూవీ, ఇప్పుడు సుక్కును అల్లు అర‌వింద్ అడ‌గ‌టం విష‌యాల‌ను చూస్తుంటే రాంచ‌ర‌ణ్ త‌న నెక్ట్స్ చ‌ర‌ణ్ మూవీని అల్లుఅరవింద్ నిర్మాణంలో చేస్తాడ‌ని తెలుస్తుంది.