చెర్రీ తో అలాంటి సినిమా చేయాలనుందంటున్న దర్శకుడు

  • IndiaGlitz, [Wednesday,September 02 2015]

ఘర్షణ', ఎంతవాడుగానీ' వంటి యాక్షన్ సినిమాలనే కాకుండా ఏ మాయ చేసావే', ఏటో వెళ్ళిపోయింది' మనసు వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. ప్రస్తుతం నాగచైతన్య, మంజిమన్ మోహన్ హీరో హీరోయిన్ గా లవ్ స్టోరీ, యాక్షన్ పార్ట్ ను మిళితం చేసి తెరకెక్కిస్తున్నాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తో లవ్, యాక్షన్ ఉన్న సినిమాని తెరకెక్కించాలనుందని, త్వరలోనే తన కోరిక తీరాలనుకుంటున్నానని తన మనసులోని మాట చెప్పుకొచ్చాడు.