నితిన్ తో మూవీ ప్లాన్ చేస్తున్న గౌతమ్ మీనన్..?
Send us your feedback to audioarticles@vaarta.com
నితిన్ తో గౌతమ్ మీనన్ నిర్మించిన కొరియర్ బాయ్ కళ్యాణ్ ఈ నెల 17న రిలీజ్ కానుంది. ప్రేమ సాయి ఈ చిత్రానికి దర్శకుడు. ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు ఉండే కొరియర్ బాయ్ కళ్యాణ్ విజయం పై చిత్రయూనిట్ చాలా నమ్మకంతో ఉన్నారు. గౌతమ్ మీనన్ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా సాహసం శ్వాసగా సాగిపో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ లో ఈ చిత్రం రూపొందుతుంది.
ఈచిత్రం తర్వాత గౌతమ్ మీనన్ నితిన్ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా గౌతమ్ మీనన్ మీడియాకి చెప్పారు. మరి..గౌతమ్ మీనన్....నితిన్ తో లవ్ స్టోరి చేస్తారా..? లేక యాక్షన్ స్టోరీచేస్తారా...? లేక నితిన్ తో చేసే సినిమా కన్నా ముందు వేరే సినిమా చేస్తారా అనేది త్వరలోనే తెలుస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com