చైతు మూవీ డేట్ ఎనౌన్స్ చేసిన గౌతమ్ మీనన్
Saturday, May 28, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్నచిత్రం సాహసం శ్వాసగా సాగిపో. తెలుగు, తమిళ్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని స్టార్ రైటర్ కోన వెంకట్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన మంజిమ మోహన్ నటిస్తుంది. సంగీత సంచలనం ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రం గురించి డైరెక్టర్ గౌతమ్ మీనన్ ట్విట్టర్ లో స్పందిస్తూ... ఈ చిత్రంలోని రసాలి, చక్కోరి పాటలు శ్రోతల హృదయాలను తాకాయి. నేను ఫస్ట్ బేసిక్ ట్యూన్స్ విన్నప్పుడు కలిగిన అనుభూతే శ్రోతలకు కలిగింది. సాహసం శ్వాసగా సాగిపో ఆడియో జూన్ 17న, ఈ చిత్రాన్ని జులై 15న రిలీజ్ చేయనున్నాం అని తెలియచేసారు. ఏమాయ చేసావే కాంబినేషన్ కావడంతో సాహసం శ్వాసగా సాగిపో చిత్రం పై ప్రారంభం నుంచి క్రేజ్ ఏర్పడింది. మరి..ఏరేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments