Bigg Boss Telugu 7 : ప్రశాంత్‌ను నమ్మించి బలి చేసిన శివాజీ.. శోభతో గొడవ , లాఠీ విసిరికొట్టిన అమర్‌దీప్ .. రతికతో గౌతమ్ లవ్

  • IndiaGlitz, [Thursday,November 23 2023]

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 80 రోజులు పూర్తి చేసుకుంది. మరికొద్దిరోజుల్లో సీజన్ ముగియనుంది. టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో తేలిపోవడానికి చాలా దగ్గరలో వుంది. హైడ్రామా, సస్పెన్స్ తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను సొంతం చేసుకున్నాడు పల్లవి ప్రశాంత్. అది చూసి శివాజీ అందరికంటే ఎక్కువగా సంతోషం వ్యక్తం చేశాడు. టాస్క్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ అందరికీ లంచ్ ఏర్పాటు చేశారు మిసెస్ బిగ్‌బాస్. ఇంటి సభ్యులంతా లంచ్ తింటూ ఎంజాయ్ చేస్తుండగా బయటి నుంచి పెద్ద కేక వినిపించింది. లోపల ఒక హత్య జరిగిందని , చనిపోయింది మిసెస్ బిగ్‌బాస్ అని బిగ్‌బాస్ చెప్పాడు. ఆమె వద్ద విలువైన వస్తువులు వున్నాయని.. అవి కూడా మిస్ అయినట్లుగా చెప్పాడు. కంటెస్టెంట్స్‌కు ఏం జరిగిందో తెలియక అయోమయంలో వుండగా.. అమర్‌దీప్, అర్జున్‌లు పోలీస్ గెటప్స్‌లో ఎంట్రీ ఇచ్చి ఇంకో షాకిచ్చారు.

ఆమెను ఎవరో మర్డర్ చేశారు.. కిల్లర్‌ను కనిపెట్టాల్సిందిగా అర్జున్ అంబటి, అతనికి అసిస్టెంట్‌గా అమర్‌కు టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. మిసెస్ బిగ్‌బాస్ వైఫ్‌కు చెఫ్‌గా ప్రశాంత్.. మేనేజర్‌గా శివాజీ, బట్లర్స్‌గా ప్రియాంక, యావర్.. దోబీగా గౌతమ్.. రతికలు సీక్రెట్ లవర్స్‌గా .. ఈ హత్య కేసు దర్యాప్తును ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయడానికి శోభా, అశ్వినీలు జర్నలిస్టులుగా వ్యవహరించాలని బిగ్‌బాస్ ఆదేశించారు. దర్యాప్తులో భాగంగా అందరి బ్యాగ్‌లను అమర్, అర్జున్‌లు చెక్ చేశారు.

ఇంత సీరియస్‌గా టాస్క్ జరుగుతున్న సమయంలో శోభాశెట్టి, అమర్‌దీప్‌కు మద్య గొడవ జరిగింది. మైక్ తీసుకుని పైపైకి వస్తుందని చెప్పి.. ఓవర్ ల్యాప్ చేస్తున్నావ్ అంటూ శోభాతో అన్నాడు అమర్‌దీప్. దీనికి బాగా హర్ట్ అయిన ఆమె గొడవకు దిగింది. కోపంతో ఊగిపోయిన అమర్ .. తన లాఠీ విసిరికొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నేను మిమ్మల్ని ఏమైనా ఆపుతున్నానా అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దానికి అశ్వినికి కోపం వచ్చింది. నా వంక చూసి చెబుతున్నావా.. నేనేం అనలేదని చెప్పింది. వీళ్లేందుకు గొడవ చేస్తున్నారో నాకు అర్ధం కావట్లేదని గందరగోళంలో పడ్డాడు అమర్. గట్టిగా మాట్లాడొద్దంటూ ఇద్దరు ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకున్నారు.

టాస్క్ డైవర్ట్ అవుతున్నట్లు గ్రహించిన బిగ్‌బాస్ వెంటనే జోక్యం చేసుకుని శివాజీని సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ప్రశాంత్‌ని చంపాల్సిందిగా ఆదేశిస్తాడు. దీనిని బట్టి శివాజీయే హంతకుడని తేలిపోయింది. ఇంట్లో ఏ కంటెస్టెంట్‌ను ఎలా హత్య చేయాలో చెప్పడానికి శివాజీకి ఒక ఫోన్‌ను కూడా ఇచ్చారు బిగ్‌బాస్. తొలుత పల్లవి ప్రశాంత్‌ను చంపాలని టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. రైతుబిడ్డ పెంచుకునే మొక్కను పోస్ట్ బాక్స్‌లో పెడితే ప్రశాంత్‌ను హత్య చేసినట్లేనని చెబుతాడు. తన ప్లాన్ అమలు చేయాలంటే ముందు ప్రశాంత్‌ను సైడ్ చేయాలనుకున్న శివాజీ.. అతనిని స్టోర్ రూమ్‌లో బంధించాడు. ఆపై మొక్కను తీసుకుని పోస్ట్ బాక్స్‌లో పెట్టేశాడు. ఎంతసేపటికీ ప్రశాంత్ కనిపించకపోవడంతో అతను ఏమైపోయాడోనని వెతికిన కంటెస్టెంట్స్ అంతా .. ఫైనల్‌గా స్టోర్‌ రూమ్‌లో వున్నట్లు కనుగొన్నారు.

అయితే ఎవ్వరికీ కనిపించకుండా దాక్కోవడంతో ప్రశాంతే.. హంతకుడని అంతా భావించారు. దీనికి క్లారిటీ ఇస్తూ జరిగినది చెప్పాడు బిగ్‌బాస్. ప్రశాంత్ చనిపోయి దెయ్యం అయ్యాడని.. అతను లైట్లు ఆర్పిన తర్వాతే ఇంట్లోకి రావాలని , కంటెస్టెంట్స్‌తో మాట్లాడకూడదని బిగ్‌బాస్ ఆదేశించారు. మరోవైపు తన మొక్క కనిపించకపోవడంతో ప్రశాంత్ అంతటా వెతుకుతూ వుంటాడు. కాకపోతే.. ప్రతీ సీజన్‌లోనూ సీక్రెట్ టాస్క్ గురించి చివరిలో రీవిల్ చేసేవారు.. కానీ ఈసారి మాత్రం హత్యలు శివాజీయే చేశాడని బిగ్‌బాస్ ఎందుకు చెప్పాడో.. దీనికి కారణం ఏంటో త్వరలోనే తేలిపోనుంది.

More News

Yuvagalam Padayatra:ఈనెల 27న 'యువగళం' పాదయాత్ర పున:ప్రారంభం.. రూట్ మ్యాప్ ఖరారు..

టీడీపీ యువనేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఈ నెల 27న పున:ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

KTR:సిరిసిల్లలో కేటీఆర్‌కు ఓటమి భయం.. ఆడియో కాల్ వైరల్..

తెలంగాణ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా జరుగుతోంది. ప్రచారానికి ఇంకో ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో

Kannappa : మంచు విష్ణు ‘‘కన్నప్ప’’ ఫస్ట్ లుక్ చూశారా.. సినిమాపై అంచనాలు పెంచేసిందిగా.. !!

మంచువారి వారసుడు విష్ణు.. హిట్టు కొట్టి చాలా ఏళ్లే అవుతోంది. ఎన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేసినా ఆయనకు గెలుపు దక్కడం లేదు.

BRS Party: బీఆర్ఎస్ పార్టీదే మళ్లీ అధికారం.. న్యూస్‌టాప్ సర్వేలో స్పష్టం

తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని న్యూస్ టాప్ సర్వే తెలిపింది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం నవంబర్ 16 నుంచి 21 మధ్య ఈ సర్వే చేశామని..

ఇకపై తెలంగాణలోనూ తిరుగుతా.. బీసీ సీఎంను చూడాలి: పవన్

తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలతో పోరాడుతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తెలిపారు. హనుమకొండలో నిర్వహించిన విజయసంకల్ప సభలో