Bigg Boss Telugu 7 : అమర్‌ని బలి చేసిన రతిక, మరోసారి శివాజీ మీదకెళ్లిన గౌతమ్.. వెళ్లిపోతానంటూ చిందులు

  • IndiaGlitz, [Saturday,November 11 2023]

బిగ్‌బాస్ 7 తెలుగులో ఎమోషన్ సీన్స్ పండుతున్నాయి. ఈ వారం మొత్తం ఎలాంటి గొడవలు, టాస్క్‌లు, ఛాలెంజ్‌లు లేకుండా ఫ్యామిలీ వీక్‌లా మారిపోయింది. శివాజీ కుమారుడు శ్రీ, అర్జున్ అంబటి సతీమణి సురేఖ, అశ్విని శ్రీ అమ్మగారు లోపలికి వచ్చారు. ఎవ్వరిని నమ్మొద్దని, నిజాయితీగా జాగ్రత్తగా ఆడాలని వీరు తమ వారికి సలహాలిచ్చారు. అలాగే గర్భవతి అయిన సురేఖకు ఇంటి సభ్యులు శ్రీమంతం చేశారు. ఇది ఆ రోజు ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది. బుధవారం గౌతమ్ అమ్మగారు, ప్రియాంకా జైన్ బాయ్‌ఫ్రెండ్ శివకుమార్, భోలే షావళి వైఫ్ హౌస్‌లో అడుగుపెట్టారు. నిన్నటి ఎపిసోడ్‌లో ప్రియాంక- శివకుమార్ జోడీ హైలైట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు బిగ్‌బాస్ హౌస్‌లో మిస్సయిన రోమాంటిక్ టచ్‌ని వాళ్లిద్దరూ ఇచ్చారు. గురువారం అమర్‌దీప్ చౌదరి భార్య తేజస్విని గౌడ, శోభాశెట్టి అమ్మగారు, ప్రిన్స్ యావర్ బ్రదర్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇవాళ రతిక తండ్రి హౌస్‌లోకి వచ్చారు. ఆయన రాగానే గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. తర్వాత ఇంటి సభ్యులకు తండ్రిని పరిచయం చేసింది. అనంతరం పల్లవి ప్రశాంత్ తండ్రి ఇంట్లో అడుగుపెట్టారు. తొలుత ప్రశాంత్ కోసం బిగ్‌బాస్ బంతిపూలను పంపించాడు. వాటిని పట్టుకుని చూసిన రైతు బిడ్డ.. వీటిని చూసి చాలా రోజులవుతోంది, నేనే పెట్టినా అంటూ ఉద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత బంగారం అని పిలుస్తూ.. మరికొన్ని బంతిపూలను తీసుకుని పల్లవి ప్రశాంత్ తండ్రి హౌస్‌లో అడుగుపెట్టాడు.

ఆయనను చూడగానే కాళ్లపై పడ్డాడు రైతుబిడ్డ. కొడుకుని దగ్గరికి తీసుకుని నిన్న చూడక ఎన్ని దినాలైంది బిడ్డ అంటూ ఆయన కూడా ఎమోషనల్ అవుతాడు. తండ్రిని ఎత్తుకుని బిగ్‌బాస్ హౌస్ మొత్తం చూపించాడు పల్లవి ప్రశాంత్. తన బిడ్డని కన్న కొడుకులా చూసుకున్నార్ సారూ అంటూ శివాజీకి ఆయన దండం పెట్టాడు. అందరూ కలిసి మెలిసి ఉండండి.. కొట్లాడకండి అంటూ అమర్‌దీప్‌కి కూడా చెప్పాడు ప్రశాంత్ తండ్రి. తర్వాత తండ్రికి అన్నం తినిపించాడు పల్లవి ప్రశాంత్. అమ్మకి బీపీ పెరుగుతోంది బిడ్డా అని తర్వాత ఆయన కొడుక్కి చెబుతాడు. దీంతో ఒక్కసారిగా అమ్మ గుర్తొచ్చి ఏడుస్తాడు ప్రశాంత్.

కాసేపు ఫ్యామిలీ వీక్‌‌ని పక్కనబెట్టి.. కెప్టెన్సీ కంటెండర్స్‌ని ఎంపిక చేసేందుకు ‘‘ ఓ బేబీ ’’ అనే టాస్క్ ఇచ్చాడు. దీనిలో భాగంగా ఇంటి సభ్యుల ఫోటోలు అతికించిన బేబీ టాయ్స్ టేబుల్‌పై వుంటాయి. బేబీ సౌండ్ వచ్చిన ప్రతిసారి ఎవరి బొమ్మ అయితే మిగిలిపోతుందో వాళ్లు ఎలిమినేట్ అయినట్లు. అలా శోభా, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్, రతిక, అశ్విని, భోలే, ప్రియాంక, గౌతమ్ ఎలిమనేట్ అయిపోయారు. అయితే ఇక్కడే రతిక కన్నింగ్ గేమ్ ఆడింది. ఓ రౌండ్‌లో రతిక టాయ్ అమర్ దగ్గర వుంటుంది.. తనకు ఈ గేమ్ ఎంతో ముఖ్యమని దయచేసి తన కోసం లోనికి వెళ్లమని అతనిని బతిమలాడుకుంటుంది.

దీనికి ససేమిరా అన్న అమర్... ఇలా త్యాగాలు చేసి అందరి దగ్గరా తిట్లు తిన్నానని అంటాడు. నీ కాళ్లు పట్టుకోమన్నా పట్టుకుంటా నంటూ రతిక ఇంకా బతిమలాడుతూనే వుంటుంది. ఎట్టకేలకు కరిగిపోయిన అమర్.. రతిక కోసం లోపలికి వెళ్తాడు. కానీ అతని బొమ్మ బయటే వుండటంతో ఆట నుంచి ఎలిమినేట్ అవుతాడు. అలా కావాలని అమర్‌ని పంపిన రతిక.. అతనిని ముంచేసింది. కానీ ఈ గేమ్‌లో మూడు నాలుగు సార్లు పరిగెత్తకుండా ఆగిపోయింది రతిక.. ఐదో రౌండ్‌లోనూ ఆమె బొమ్మను ఎవరూ తీసుకెళ్లలేదు.

చివరికి గేమ్‌లో శివాజీ, గౌతమ్, అర్జున్ మిగులుతారు. శివాజీకి గౌతమ్ బొమ్మ దొరుకుతుంది.. కానీ ఆయన లోపలికి వెళ్లకుండా బయటే వుండిపోవడంతో గౌతమ్ ఎలిమినేట్ అవుతాడు. చివరికి శివాజీ, అర్జున్‌లు కెప్టెన్సీ కంటెండర్స్‌గా మిగిలిపోతారు. ఈ పరిణామానికి గౌతమ్ బాగా హర్ట్ అవుతాడు. తనను శివాజీ కావాలనే ఎలిమినేట్ చేశాడంటూ వాగ్వాదానికి దిగాడు. ఇద్దరూ ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లేంతగా గొడవ పడ్డారు. నువ్వు కేవలం అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నావ్ అని శివాజీ అనే సరికి గౌతమ్‌కి కోపం వచ్చింది. నేను వెళ్లిపోతా బిగ్‌బాస్ తలుపు తెరవండి అంటాడు. గేట్లను గట్టిగా బాదుతూ తాను వెళ్లిపోతానంటూ మారం చేస్తాడు.. ఇంతలో శోభాశెట్టి వచ్చి అతడికి సర్దిచెబుతుంది

More News

Palvai Sravanti:కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి..

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె,

Niharika:ఫస్ట్ టైం మూవీ ప్రొడక్షన్‌లోకి నిహారిక .. వరుణ్ - లావణ్య సమక్షంలో ఓపెనింగ్ , డీటెయిల్స్ ఇవే

మెగా వారసురాలు నిహారిక కొణిదెల నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై పలు వెబ్ సిరీస్‌లు,

Chandramohan:బిగ్ బ్రేకింగ్: సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

సీనియర్ నటులు చంద్ర మోహన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో

Siddaramaiah:కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: సిద్ధరామయ్య

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని గెలిపించేందుకు కామారెడ్డి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

Chandrababu:చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా చేసిన హైకోర్టు

స్కిల్ డెవల్‌ప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.