కోటిలింగాలలో 'గౌతమిపుత్ర శాతకర్ణి' ట్రైలర్ విడుదల

  • IndiaGlitz, [Sunday,December 11 2016]

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నందమూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం కావ‌డం, తెలుగు జాతి ఔన‌త్యాన్ని ప్ర‌పంచానికి చాటిన తెలుగు చ‌క్ర‌వ‌ర్తి గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం కూడా కావ‌డంతో సినిమా ప్రారంభం నుండే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.
ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టు ద‌ర్శ‌కుడు క్రిష్‌, నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాయిబాబులు సినిమా గ్రాండ్‌గా తెర‌కెక్కిస్తున్నారు.సినిమా ఫ‌స్ట్‌లుక్‌కి ఆడియెన్స్ నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇటీవ‌ల‌విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా వంద థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయాల‌నుకున్నారు కానీ అదే రోజు ధృవ సినిమా ఉండ‌టంతో నిర్మాత‌లు ప్రోగ్రామ్‌ను డిసెంబ‌ర్ 16కు వాయిదా వేశారు. ఇప్పుడు ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 16న క‌రీనంగ‌ర్ జిల్లా కోటిలింగాల ప్రాంతంలో విడుద‌ల చేస్తార‌ట‌. కోటిలింగా ప్రాంత‌మే ఎందుకంటే ఈ ప్రాంతం మొద‌ట శాత‌క‌ర్ణి రాజ‌ధానిగా ఉండ‌టం. అక్క‌డే శాత‌క‌ర్ణి త‌ల్లి గౌత‌మి జ‌న్మించ‌డం వంటి చారిత్ర‌క కార‌ణాలేన‌ట‌.