గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ రికార్డ్..!
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి ధియేట్రికల్ ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. నిన్న ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. దీంతో ఫాస్ట్ గా మిలియన్ మార్క్ అందుకున్న తెలుగు సినిమా ట్రైలర్ గా గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 4.5 గంటల్లోనే మిలియన్ మార్క్ ను అందుకుంది.
ఇక సంక్రాతికి వస్తున్న మెగాస్టార్ ఖైదీ నెం 150 టీజర్ కూడా రికార్డ్ క్రియేట్ చేసింది. ఖైదీ నెం 150 టీజర్ 3 గంటల 5 నిమిషాల్లోనే మిలియన్ మార్క్ అందుకుని టీజర్ల పాత రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇలా సంక్రాంతి రానున్న మెగాస్టార్ ఖైదీ నెం 150, యువరత్న బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాల టీజర్ & ట్రైలర్ పోటీపడి రికార్డ్స్ క్రియేట్ చేస్తుండడంతో సినిమాలపై మరింత ఆసక్తి పెరుగుతుంది. మరి...ఈ రెండు చిత్రాల రిజల్ట్ ఎలా ఉంటుందో..? ఏ చిత్రం హయ్యస్ట్ కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments