విజువల్ వండర్ - గౌతమీపుత్ర శాతకర్ణి థియేట్రికల్ ట్రైలర్..!
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈరోజు ఉదయం జగిత్యాల జిల్లా కోటిలింగాలలోని ఎన్టీఆర్ విగ్రహానికి నందమూరి బాలకృష్ణ పూలమాల వేసిన అనంతరం కోటిలింగాలలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసారు. ఆతర్వాత సాయంత్రం 5. 38 నిమిషాలకు కరీంనగర్ లోని శ్రీ తిరుమల థియేటర్స్ లో గౌతమీపుత్ర శాతకర్ణి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 100 థియేటర్స్ లో 100 మంది అతిధులు గౌతమీపుత్రశాతకర్ణి ట్రైలర్ ను రిలీజ్ చేయడం విశేషం.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే...మా జైత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీరఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాను. సమయం లేదు మిత్రమా...శరణమా..రణమా..అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.బాలయ్య, శ్రియల పై చిత్రీకరించిన రొమాంటిక్ సీన్స్ చూస్తుంటే శాతకర్ణిలో వీరరసమే కాదు శృంగార రసం కూడా ఉంది అనిపిస్తుంది. ఈ 33 కరలాలలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీద ఉన్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ పడాలి అంటూ హేమమాలిని చెప్పే డైలాగ్స్ చూస్తుంటే...ఈ మూవీ అందర్ని ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు అనిపిస్తుంది. తక్కువ టైమ్ లో ఇంత అద్భుతంగా విజువల్ వండర్ అనేలా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన క్రిష్ ఎంతైనా అభినందనీయుడు. టోటల్ గా ట్రైలర్ చూస్తుంటే...భారీ సెట్టింగ్ లు, రాజదర్బారులు, భారీ తారాగణంతో భారీ స్ధాయిలో రూపొందిన ఈ విజువల్ వండర్ గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగు చలన చరిత్రలో చరిత్ర సృష్టించడం ఖాయం అనిపిస్తుంది. ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను ఈనెల 26న తిరుపతిలో భారీ స్ధాయిలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com