విజువ‌ల్ వండ‌ర్ - గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి థియేట్రిక‌ల్ ట్రైల‌ర్..!

  • IndiaGlitz, [Friday,December 16 2016]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈరోజు ఉద‌యం జ‌గిత్యాల జిల్లా కోటిలింగాల‌లోని ఎన్టీఆర్ విగ్ర‌హానికి నంద‌మూరి బాల‌కృష్ణ‌ పూలమాల వేసిన అనంత‌రం కోటిలింగాల‌లోని శివాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేసారు. ఆత‌ర్వాత సాయంత్రం 5. 38 నిమిషాల‌కు కరీంన‌గ‌ర్ లోని శ్రీ తిరుమ‌ల థియేట‌ర్స్ లో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను రిలీజ్ చేసారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 100 థియేట‌ర్స్ లో 100 మంది అతిధులు గౌత‌మీపుత్ర‌శాత‌క‌ర్ణి ట్రైల‌ర్ ను రిలీజ్ చేయ‌డం విశేషం.

ఇక ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే...మా జైత్ర‌యాత్ర‌ను గౌర‌వించి మా ఏలుబ‌డిని అంగీక‌రించి మీ వీర‌ఖ‌డ్గాన్ని మా రాయ‌బారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతార‌ని ఆశిస్తున్నాను. స‌మయం లేదు మిత్ర‌మా...శ‌ర‌ణ‌మా..ర‌ణ‌మా..అంటూ బాల‌య్య చెప్పే డైలాగ్ తో ట్రైల‌ర్ స్టార్ట్ అవుతుంది.బాల‌య్య‌, శ్రియ‌ల పై చిత్రీక‌రించిన రొమాంటిక్ సీన్స్ చూస్తుంటే శాత‌క‌ర్ణిలో వీర‌ర‌స‌మే కాదు శృంగార ర‌సం కూడా ఉంది అనిపిస్తుంది. ఈ 33 క‌ర‌లాల‌లు క‌రిగించి మ‌హాఖ‌డ్గాన్ని త‌యారు చేయించండి. ఆ ఖ‌డ్గాన్ని ధ‌రించి సింహాస‌నం మీద ఉన్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ ప‌డాలి అంటూ హేమ‌మాలిని చెప్పే డైలాగ్స్ చూస్తుంటే...ఈ మూవీ అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది అన‌డంలో సందేహం లేదు అనిపిస్తుంది. త‌క్కువ టైమ్ లో ఇంత అద్భుతంగా విజువ‌ల్ వండ‌ర్ అనేలా ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని తెర‌కెక్కించిన క్రిష్ ఎంతైనా అభినంద‌నీయుడు. టోట‌ల్ గా ట్రైల‌ర్ చూస్తుంటే...భారీ సెట్టింగ్ లు, రాజ‌ద‌ర్బారులు, భారీ తారాగ‌ణంతో భారీ స్ధాయిలో రూపొందిన‌ ఈ విజువ‌ల్ వండ‌ర్ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి తెలుగు చ‌ల‌న చ‌రిత్ర‌లో చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం అనిపిస్తుంది. ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ ను ఈనెల 26న తిరుప‌తిలో భారీ స్ధాయిలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని జ‌న‌వ‌రిలో సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు.

More News

ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ వాయిదా..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తున్నారు. డాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న కాట‌మ‌రాయుడు చిత్రం పొల్లాచ్చిలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

మ‌హేష్ - త్రివిక్ర‌మ్ సినిమా ఎప్పుడు..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో అత‌డు, ఖ‌లేజా చిత్రాలు రూపొందిన విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో మూడ‌వ చిత్రం రానుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

విసారణై తో చాలా నేర్చుకున్నాం - ధనుష్

2017 ఆస్కార్ అవార్డ్స్ కు గాను ఇండియా తరుపున వెట్రీమారన్ తెరకెక్కించిన తమిళ చిత్రం విసారణై ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

రామ్ గోపాల్ వర్మ 'వంగ వీటి' చిత్రాన్నిడిసెంబర్ 23న గ్రాండ్ రిలీజ్ చేస్తున్న అభిషేక్ పిక్చర్స్

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ ద్శకత్వంలో రూపొందిన చిత్రం `వంగవీటి`. జీనియస్, రామ్లీల వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత దాసరి కిరణ్కుమార్ నిర్మాతగా రామదూత క్రియేషన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సెన్సేషనల్ మూవీ `వంగవీటి`.

హిలేరియస్ ఎంటర్ టైనర్ పిట్టగోడ చిత్రాన్ని ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం - డి.సురేష్ బాబు

విశ్వదేవ్ రాచకొండ,పునర్నవి హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు సమర్పణలో