గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ & ఆడియో రిలీజ్ డీటైల్స్..!

  • IndiaGlitz, [Friday,November 11 2016]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై ఈ చిత్రం రూపొందుతుంది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో డ్రీమ్ గ‌ర్ల్ హేమ‌మాలిని గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి త‌ల్లి గౌత‌మీ బాల‌శ్రీగా న‌టిస్తుంటే... శ్రియ గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి భార్య వ‌శిష్టి దేవిగా న‌టిస్తున్నారు. ఇక గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి అఫిషియ‌ల్ ట్రైల‌ర్ ను డిసెంబ‌ర్ 9న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ అందించిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఆడియోను డిసెంబ‌ర్ 16న గ్రాండ్ గా రిలీజ్ చేయ‌నున్నార‌ని తెలిసింది. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు.