శాతకర్ణికి పన్ను మినహాయింపు....?

  • IndiaGlitz, [Wednesday,January 04 2017]

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్నచిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. ఈ సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. భార‌త‌దేశ తొలి చక్ర‌వ‌ర్తిగా శాత‌కర్ణి సాధించిన విజ‌య‌గాథ‌పై రూపొందిన ఈ సినిమా తెలుగు జాతి ఔన‌త్యాన్ని చాటేలా ఉండ‌టంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వినోదపు ప‌న్ను మిన‌హాయింపు ఇస్తున్నార‌ని స‌మాచారం. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అధికార‌క స‌మాచారం లేదు. సినిమా సెన్సార్ పూర్త‌యిన త‌ర్వాత ఈ విష‌యాన్ని అధికార‌కంగా ప్ర‌క‌టించే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.