గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ పూర్తి..!
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ చిత్రాన్ని జాగర్లమూడి క్రిష్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ నటిస్తుంది. హేమమాలిని బాలకృష్ణ తల్లి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఆఖరి పాటను బాలకృష్ణ, శ్రియ లపై రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించారు. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక థియేట్రికల్ ట్రైలర్ ను డిసెంబర్ 9న రిలీజ్ చేయనున్నారు. ఆడియో ఫంక్షన్ ను డిసెంబర్ రెండో వారంలో తిరుపతిలో భారీ స్ధాయిలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments