'గౌతమిపుత్ర శాతకర్ణి' లాయల్టీ కాంటెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
శాతవాహన శకం..తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శకం. ఇన్ని శతాబ్దాల తర్వాత ఈ వీరుడి కథను తెరకెక్కిస్తున్నారు అంజనీ పుత్రుడు క్రిష్, ఈ వీరుడుకి ప్రాణం పోస్తున్నారు బసవతారకమ్మ పుత్రుడు నందమూరి బాలకృష్ణ. ఈ మహా ప్రయత్నంలో ప్రేక్షకులను భాగం చేసేందుకు గౌతమిపుత్ర శాతకర్ణి టీం తీసుకొస్తున్న ప్రోగ్రామ్ `గౌతమిపుత్ర శాతకర్ణి లాయల్టీ కాంటెస్ట్`. గౌతమిపుత్ర శాతకర్ణి.కామ్‌లో అభిమానుల కోసం శాతావాహనుల అద్భుత చరిత్ర. బాలయ్య వంద సినిమాల ప్రస్థానాన్ని పొందు పరిచారు.
మీరు రాజుగా మారాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీరు గౌతమిపుత్రశాతకర్ణి.కామ్‌లోని లాయల్టీ కాంటెస్ట్‌లో వెంటనే రిజిష్టర్ అవ్వండి. సులువైన ప్రశ్నలకు వచ్చే సమాధానాల కోడ్స్‌లో శాతవాహనుల రాజ్యానికి చెందిన అమరావతి, అనూప, విదర్భ, సౌరాష్ట్ర, అవంతి, అసిక రాజ్యాల్లో మీరు జయించాలనుకున్న రాజ్యాలను ఎంచుకోండి. క్విజ్‌లో ఫ్రెండ్స్, ప్యామిలీ రెఫరెన్స్, ఫేస్బుక్, రేడియోల ద్వారా షేర్ చేయబోయే కోడ్స్ వంటి యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసి స్పిన్ వీల్ తిప్పండి. తద్వారా మీ రాజ్య బుద్ధి, భుజ, గజ, అశ్వ, ఆయుధ బలగాలను పెంచుకుని ఆ రాజ్యాలను జయించండి.
పాయింట్స్ కూడగట్టి లీడర్ బోర్డ్‌లో టాప్కు చేరి ఆ రాజ్యంలో బహుమతులను చేజిక్కించుకోండి. సినిమాలో బాలయ్య ధరించిన వస్త్రాలు, స్మార్ట్‌ఫోన్స్, టీషర్ట్స్ సహా మరెన్నో బహుమతులను గెలుకోండి. ఇలా కాంటెస్ట్ ద్వారా వచ్చిన డబ్బును బసవతారకమ్మ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు డొనేట్ చేస్తారు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్న వారిలో వంద మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపికచేస్తారు. ఈ ఎంపికై వందమంది నందమూరి బాలకృష్ణను కలిసి ప్రీమియర్ షో చూసి, డిన్నర్ చేసే అవకాశాన్ని కాంటెస్ట్ కలిగిస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com