'గౌతమీపుత్ర శాతకర్ణి' మొదటి షెడ్యూల్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ప్రేక్షకలు, నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టీజియస్ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి` శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇటీవల మొరాకాలో ప్రారంభమైన మొదటి షెడ్యూల్ పూర్తయింది. బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాని నిర్మిస్తున్నారు.
ఇటీవల జాతీయఅవార్డును సొంతం చేసుకున్న క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్నో హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకునే మొరాకోలోని అద్భుతమైన లోకేషన్స్ లోఇంత పెద్ద షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకున్న మొదటి తెలుగు సినిమాయే కాదు, మొదటి ఇడియన్ మూవీ కూడా గౌతమీపుత్ర శాతకర్ణి కావడం విశేషం. మొరాకాలోని అట్లాస్ స్టూడియోస్, వరు జార్జియస్ లో సినిమా చిత్రీకరణను జరుపుకుంది. ఒకటవ శతాబ్దానికి చెందిన సీన్స్ ను, రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో హాలీవుడ్ ఫైటర్స్ తో హీరో నందమూరి బాలకృష్ణ, కబీర్ బేడికి మధ్య యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. దాదాపు 1000 ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో రెండు వందల గుర్రాలు, రెండు వందల ఒంటెలను ఉపయోగించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com