'గౌతమీపుత్ర శాతకర్ణి' మొదటి షెడ్యూల్ పూర్తి

  • IndiaGlitz, [Monday,May 23 2016]

తెలుగు ప్రేక్షకలు, నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టీజియస్ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి' శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇటీవల మొరాకాలో ప్రారంభమైన మొదటి షెడ్యూల్ పూర్తయింది. బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాని నిర్మిస్తున్నారు.

ఇటీవల జాతీయఅవార్డును సొంతం చేసుకున్న క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్నో హాలీవుడ్ చిత్రాలు షూటింగ్ జరుపుకునే మొరాకోలోని అద్భుతమైన లోకేషన్స్ లోఇంత పెద్ద షెడ్యూల్ చిత్రీకరణను జరుపుకున్న మొదటి తెలుగు సినిమాయే కాదు, మొదటి ఇడియన్ మూవీ కూడా గౌతమీపుత్ర శాతకర్ణి కావడం విశేషం. మొరాకాలోని అట్లాస్ స్టూడియోస్, వరు జార్జియస్ లో సినిమా చిత్రీకరణను జరుపుకుంది. ఒకటవ శతాబ్దానికి చెందిన సీన్స్ ను, రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో హాలీవుడ్ ఫైటర్స్ తో హీరో నందమూరి బాలకృష్ణ, కబీర్ బేడికి మధ్య యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించారు. దాదాపు 1000 ఈ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో రెండు వందల గుర్రాలు, రెండు వందల ఒంటెలను ఉపయోగించారు.

More News

మ‌రో 30 ఏళ్ల‌కు రెడీ అంటున్న నాగ్..

విక్ర‌మ్ సినిమాతో తెలుగు తెర పై హీరోగా ఎంట్రీ ఇచ్చి..అన‌తి కాలంలోనే తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నారు కింగ్ నాగార్జున‌. రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా కొత్త‌ద‌నం కోసం త‌పించి... తెలుగు సినిమా న‌డ‌త‌ను మార్చి... నాగ్  ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచారు.

మంత్రి జూపల్లి ని కలిసిన నమ్రత...

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఈరోజు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసారు.

సూపర్ హిట్ రీమేక్ ఆలోచనలో చైతు....

ప్రేమమ్,సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న అక్కినేని నాగచైతన్య

నాగార్జునతో విమలారామన్...

అక్కినేని నాగార్జున ప్రధానపాత్రలో త్వరలోనే భక్తిరస చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు.

క‌బాలి కొత్త రికార్డ్..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రంలో రజ‌నీకాంత్ స‌ర‌స‌న రాధికా ఆప్టే న‌టించింది. ఇటీవ‌ల రిలీజైన క‌బాలి టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.దీంతో క‌బాలి టీజ‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను మ‌రింత పెంచేసింది.