గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ - 1 మిలియన్ వ్యూస్..!
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శాతకర్ణి తల్లి బాలశ్రీ పాత్రలో హేమమాలిని నటిస్తున్నారు. శాతకర్ణి భార్య శ్రియ నటిస్తుంది. విజయదశమి కానుకగా గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ ను ను గౌతమీ బాలశ్రీ పాత్ర పోషిస్తున్న హేమమాలిని రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా డైరెక్టర్ క్రిష్ మాట్లాడుతూ...నేను, బాలకృష్ణ గారు హేమమాలిని గారి చేతుల మీదుగా గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ రిలీజ్ చేయించాలని అనుకున్నాం. మేము అనుకున్నట్టుగానే హేమమాలిని గారి చేతుల మీదుగా ఈ టీజర్ రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రీ లుక్ & ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభించడంతో టీజర్ కు అంతకు మించిన రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం అన్నారు.
క్రిష్ ఊహించినట్టుగానే గౌతమీపుత్రశాతకర్ణి టీజర్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ టీజర్ తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 24 గంటల లోపే ఈ టీజర్ 1 మిలియన్ వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేయడం విశేషం. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ టీజర్ 1 మిలియన్ వ్యూస్ సాధించిన విషయాన్ని అఫిషియల్ గా ఎనౌన్స్ చేసారు.
ఈ చిత్రానికి సమర్పణ బిబో శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్ - భూపేస్ భూపతి, కెమెరామెన్ - జ్ఞానశేఖర్, సంగీతం - చిరన్ తన్ భట్, సాహిత్యం - సిరివెన్నెల సీతారామాశాస్త్రి, డైలాగ్స్ - బుర్రా సాయిమాధవ్, ఫైట్స్ - రామక్ లక్ష్మణ్, కో ప్రొడ్యూసర్స్ - కొమ్మినేని వెంకటేశ్వరరావు, ప్రొడ్యూసర్స్ - వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, డైరెక్టర్ క్రిష్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com