యూరప్ లో 'గౌతమిపుత్ర శాతకర్ణి'

  • IndiaGlitz, [Monday,December 05 2016]

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సంక్రాంతి సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా విడుద‌ల కానుంది. ముఖ్యంగా ఓవ‌ర్‌సీస్‌లో గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి భారీగా విడుద‌ల‌వుతుండ‌టం విశేషం. సరిగ‌మ సినిమా, పి.జె.ఎంట‌ర్‌టైన్మెంట్ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ‌లు గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిని యూర‌ప్‌లో విడుద‌ల చేస్తున్నాయి.