గౌతమీపుత్ర శాతకర్ణి బిజినెస్ డీటైల్స్..!

  • IndiaGlitz, [Saturday,October 29 2016]

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న వంద‌వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. ఈ చిత్రాన్ని జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్నారు. బిబో శ్రీనివాస్ స‌మ‌ర్ప‌ణ‌లో వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్ల‌మూడి సాబాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభమైన‌ప్ప‌టి నుంచి అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ క్రేజ్ ఏర్ప‌డింది. డిస్ట్రిబ్యూట‌ర్స్ కూడా ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం గురించి పోటీప‌డి రైట్స్ సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో బిజినెస్ పూర్తి చేసుకోవ‌డం విశేషం.
బాల‌య్య లుక్, టీజ‌ర్ సినిమా పై మ‌రింత ఇంట్ర‌స్ట్ పెంచేసింది. గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి బిజినెస్ పూర్త‌యిన సంద‌ర్భంగా ఏరియా వైజ్ ఈ మూవీ రైట్స్ ఎవ‌రెవ‌రు ద‌క్కించుకున్నారు వారి వివ‌రాల‌ను నిర్మాత తెలియ‌చేసారు. నైజాం - గ్లోబ‌ల్ సినిమాస్ సుధాక‌ర్ రెడ్డి, సీడెడ్ - వారాహి సాయి కొర్ర‌పాటి, వైజాగ్ - వారాహి సాయి కొర్ర‌పాటి, ఈస్ట్ - వారాహి సాయి కొర్ర‌పాటి, సురేష్ మూవీస్, వెస్ట్ - ఎల్.వి.ఆర్, కృష్ణ - బాకేరి ప్ర‌సాద్, నెల్లూరు - భ‌ర‌త్, గుంటూరు - ఎస్.మూవీస్ సుధాక‌ర్ ద‌క్కించుకున్నారు. దీపావ‌ళి కానుక‌గా బాల‌య్య న్యూలుక్ రేపు రిలీజ్ చేయ‌నున్నారు. ఇక అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ చిత్రాన్నిసంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ డీటైల్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత తదుపరి చిత్రాన్ని ఎవరితో చేస్తాడనేది ఆసక్తిగా మారింది.

నానితో దిల్ రాజు సినిమా..!

నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేను లోకల్ అనే చిత్రాన్నినిర్మిస్తున్నారు.

స‌ప్త‌గిరి కోసం ప‌వ‌ర్ స్టార్..!

టాలీవుడ్ క్రేజీ కమెడియన్ సప్తగిరి హీరోగా న‌టిస్తున్నచిత్రం స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మాస్టర్స్ హోమియోపతి అధినేత డాక్టర్ రవికిరణ్ తొలి ప్రయత్నంగా సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకం పై అత్యంత గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఆమె అతడైతే' చిత్రం అందరికి నచ్చుతుంది - నిర్మాతలు ఎం.మారుతిప్రసాద్ , నెట్టెం రాధాకృష్

కొత్తదనం ఉన్న చిత్రాలను,విభిన్నమైన కధా చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించి పెద్ద సక్సెస్ చేశారు.

బుల్లితెర పై రజనీ కబాలి..!

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన సంచలన చిత్రం కబాలి.