గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో రిలీజ్ వాయిదా..!

  • IndiaGlitz, [Friday,December 09 2016]

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి. జాగ‌ర్ల‌మూడి క్రిష్ తెర‌కెక్కిస్తున్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి ఆడియోను ఈ నెల 16న తిరుప‌తిలో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు నిర్మాత రాజీవ్ రెడ్డి గ‌తంలో ప్ర‌క‌టించారు. అయితే...ఇప్పుడు ఆడియో రిలీజ్ వాయిదా ప‌డిందని స‌మాచారం.
కార‌ణం ఏమిటంటే....ఈ ఆడియో వేడుక‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడును ఆహ్వానించారు. అయితే... వీరిద్ద‌రికి ఈనెల 16న వేరే కార్య‌క్ర‌మాలు ఉండ‌డంతో ఆడియో రిలీజ్ వాయిదా వేసార‌ట‌. ఈనెల 22, 23, 24 ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజున ఆడియో ఫంక్ష‌న్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నార‌ట‌. అయితే...థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ను మాత్రం ఈ నెల 16న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

సెన్సార్ పూర్తి చేసుకున్న 'నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్'

లక్కీ మీడియా బ్యానర్ ను స్టార్ట్ చేసి పదేళ్లుగా మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత బెక్కం వేణుగోపాల్(గోపి)

ఎన్టీఆర్ కొత్త సినిమాని ఈరోజే ఎనౌన్స్ చేయడానికి కారణం ఇదే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ న్యూమూవీని ఎనౌన్స్ చేయడానికి చాలా టైమ్ తీసుకున్నారు.

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేయనున్నాడు

అమితాబ్ - నాగ్ అతిధులుగా వంగవీటి..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే.విజయవాడలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా వర్మ

ఖైదీ నెం150 టీజర్ రికార్డ్..!

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం 150 సంక్రాంతి కానుక గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.